KA Paul And Minister Roja : మంత్రి రోజాని అలా తిట్టేశావేంటి డాక్టర్ కేఏ పాల్.!
NQ Staff - November 28, 2022 / 01:07 PM IST

KA Paul And Minister Roja : ఆయనంతే, ఎవర్నయినా తేలిగ్గానే తిట్టేయగలడు. ఆయన మాటకి హద్దూ అదుపూ వుండవు. ఆ మాటకొస్తే, ఆమె కూడా అంతే. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది. సరిపోయారు ఇద్దరూ.!
ఒకరు కిలారి ఆనంద్ పాల్. ఇంకొకరు వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా. ఇద్దరూ ఇద్దరే.! కానీ, ఈ ఇద్దరికీ ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడటంలేదు. పవన్ కళ్యాణ్‌ని విమర్శించే క్రమంలో తన పేరుని రోజా ప్రస్తావించడంపై కేఏ పాల్కి ఒళ్ళు మండిపోయింది.
పందిలా తింటుందేమో.. పిచ్చి కుక్కలా మాట్లాడుతుంది..
ఇదెక్కడి పంచాయితీ.? ఆమె రాష్ట్రానికి మంత్రి. అలాంటి మంత్రిని పట్టుకుని పందిలా తింటుందేమో.. పిచ్చి కుక్కలా అరుస్తుంది.. అనడం ఎంతవరకు కరెక్టు పాల్ గారూ.?
ముందే చెప్పుకున్నాం కదా, పాల్ ఎవరినీ లెక్క చెయ్యడు. తెలంగాణ ముఖ్యమంత్రి మీద కూడా విమర్శలు చేసేయగలడు.. ఇంతకన్నా ఘాటుగా.
ఒక్కటి మాత్రం నిజం.. రోజాని ఎవరైనా విమర్శించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. ఆమె నోరు అలాంటిది.. ఎవరి మీద అయినా విచక్షణా రహితంగా విమర్శలతో విరుచుకుపడి పోతుంటుంది.
అలాంటి రోజానే తూలనాడేలా కేఏ పాల్ విమర్శించేసరికి, పాల్ విమర్శల తాలూకు వీడియో వైరల్ అయిపోయింది.