ఏపీ కి వెళ్లే వారికీ శుభవార్త
Admin - August 1, 2020 / 06:19 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎంతలా అంటే రోజు పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల కేంద్ర హోంశాఖ ఆగస్ట్ 1 నుండి అన్‌లాక్ 3 ప్రక్రియను ప్రారంభించడంతో రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కఠిన కండీషన్లను కాస్త తేలిక చేయనుంది. ఇప్పటినుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలి అనుకునేవారు స్పందన వెబ్‌సైట్ (Spandana website)లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకుంటే చాలని తెలిపారు. అలాగే ఈ-పాస్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. అంతేకాకుండా నేరుగా వారి మొబైల్ ఈమెయిల్‌కి వస్తుంది.
ఆ మెయిల్ ను మరియు ఇతర ఐడి ప్రూఫ్ ను పోలీసులకు చూపిస్తే ఏపీ లోకి అనుమతి ఇవ్వనున్నారు. అలాగే అక్కడి ఆరోగ్య శాఖ ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేస్తారు. మొత్తంగా ఆగస్ట్ 2 నుంచి ఇలా ఆటోమేటిక్ ఈ-పాస్ లభించనుందని ఏపీ కొవిడ్ కంట్రోల్ రూమ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు తెలిపారు. అందువల్ల ఏపీకి వెళ్లాలనుకునేవారు ఈ -పాస్ ను తొందరగా ఏర్పాటు చేసుకొని ప్రయాణం చేయవచ్చని తెలిపింది.