Junior NTR : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు తారక్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..?
NQ Staff - May 20, 2023 / 11:12 AM IST

Junior NTR : సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డు కైతలాపూర్ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు.
ప్రత్యేక అతిథిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు. ఇక ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నారు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మురళీ మోహన్, రాఘవేంద్రరావు, కల్యాణ్ రామ్ లాంటి వారిని ఈ వేడుకకు రావాలంటూ ఆహ్వానించారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఓ కీలక ప్రకటన వచ్చింది.
ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్ టీడీ జనార్థన్ రీసెంట్ గా వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావట్లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ టీమ్ ప్రకటన చేసింది. మే20న జూనియర్ ఎన్టీఆర్ 40వ బర్త్ డే ఉంది.
పైగా అంతకు ముందే ఫ్యామిలీతో కలిసి చేసుకున్న ప్లాన్స్ కూడా ఉన్నందున హాజరు కాలేకపోతున్నారని తెలపడానికి చింతిస్తున్నాము అంటూ చెప్పింది. ఆర్గనైజింగ్ టీమ్ వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు తారక్ టీమ్ వెల్లడించింది. కాగా ఎన్టీఆర్ రాకపోవడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయని కొందరు అంటున్నారు.