Gopichand Malineni : తారక్‌ను బాలయ్య ముందు తక్కువ చేసిన గోపీచంద్ మలినేని..!
NQ Staff - January 22, 2023 / 09:34 AM IST

Gopichand Malineni : జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ వైపు ఆయన క్రేజ్ దూసుకుపోతోంది. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అంతకు ముందు సౌత్ ఇండియాకు పరిమితం అయిన ఆయన క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా దూసుకుపోతోంది.
అలాంటి ఎన్టీఆర్ ను ఇప్పుడు ఏదైనా సినిమాలో చిన్న పాత్ర చేయమంటే చేస్తాడా.. అస్సలు చేయడు కదా.. ఎందుకంటే ఆయన రేంజ్ వేరే లెవల్. అలాంటి ఆయన్ను ఇప్పుడు దారుణంగా అవమానించాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఆయన తాజాగా డైరెక్ట్ చేసిన మూవీ వీరసింహారెడ్డి.
ఆ రెండు పాత్రలు హైలెట్..
బాలయ్య హీరోగా వచ్చిన ఈ మూవీ మంచి హిట్ కొట్టింది. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే ఈ మూవీలో బాలయ్య రెండు పాత్రలు చేశాడు. ఇందులో వీరసింహారెడ్డి, జైసింహారెడ్డి పాత్రలు బాగా ఆకట్టుకున్నాయి. కానీ సినిమా మొత్తం వీరిసింహారెడ్డి చుట్టే తిరుగుతుంది.
కాగా ఇందులో జైసింహారెడ్డి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే బాగుండు అని, బాలయ్య, జూనియర్ కలసి నటిస్తే చూడాలనేది ఫ్యాన్స్ కోరిక అంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్. దాంతో ఇప్పుడు ఆయనపై తారక్ అభిమానులు భగ్గుమంటున్నారు. తారక్ రేంజ్‌కు అలాంటి చిన్న పాత్రలో నటిస్తాడా.. పైగా బాలయ్య కంటే తక్కువ పాత్రలో నటిస్తాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లతో ఎన్టీఆర్‌ను అవమానించొద్దు అంటూ కోరుతున్నారు.