Junior NTR : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాబాయికి ఫోన్ చేసిన ఎన్టీఆర్
NQ Staff - January 27, 2023 / 04:14 PM IST

Junior NTR : నారా లోకేష్ నేడు ప్రారంభించిన పాద యాత్రలో పాల్గొన్న నందమూరి హీరో తారకరత్న కొద్ది సేపటికే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది అంటూ ప్రచారం జరగడంతో నందమూరి అభిమానులతో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఒకానొక సమయంలో తారకరత్న పల్స్ పూర్తిగా ఆగి పోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాబాయ్ బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం అందుతుంది.

Junior NTR Called Balakrishna About Tarakaratna Health Condition
తారకరత్నను ఏ ఆస్పత్రికి తరలిస్తున్నారు.. ఎలాంటి చికిత్స అందజేస్తున్నారు అనే విషయమై కూడా బాబాయి బాలకృష్ణను ఎన్టీఆర్ అడిగినట్లు సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ ఇంకా తారక రత్న యొక్క ఆరోగ్యం గురించి పలు విషయాలను కూడా ఎన్టీఆర్ అడిగాడట.
తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య తో చెప్పాడట. నందమూరి అభిమానులు అంతా కూడా తారకరత్న కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం తారకతర్న ను బెంగళూరుకు తరలిస్తున్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.