Health Tips : ఈ జ్యూస్ లు తాగితే.. హార్ట్ ఎటాక్ లు రమ్మన్నా రావు..!

NQ Staff - November 9, 2023 / 02:05 PM IST

Health Tips : ఈ జ్యూస్ లు తాగితే.. హార్ట్ ఎటాక్ లు రమ్మన్నా రావు..!

Health Tips :

ప్రస్తుత రోజుల్లో హార్ట్ ఎటాక్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఎప్పుడు ఎవరిని కబలిస్తుందో తెలియక అందరూ మదన పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరినీ హార్ట్ ఎటాక్ లు కబలిస్తున్నాయి. ఒకప్పుడు మనకు అసలు హార్ట్ ఎటాక్ చావులు ఏమీ కనపడేవి కాదు. కానీ ఇప్పుడు మాత్రం హార్ట్ ఎటాక్ తో చనిపోతున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. పది మందిలో నలుగురు హార్ట్ ఎటాక్ వల్లనే చనిపోతున్నారు. అయితే ఈ రకమైన హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉండేందుకు రకరకాల మందులు వాడుతుంటారు.

కానీ అలా కాకుండా ఇప్పుడు మేం చెప్పే జ్యూస్ లు కొన్ని తాగితే సరిపోతుంది. మీకు జీవితంలో హార్ట్ ఎటాక్ సమస్యలు అస్సలు రానే రావు. బీట్ రూట్ జ్యూస్ లో నైట్రేట్ లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల గుండె రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. దాని వల్ల రక్తపోటు పూర్తిగా తగ్గిపోతుంది. రక్త పోటు తగ్గితో రక్త ప్రసరన మెరుగవుతుంది. దాంతో గుండె పోటు వచ్చేందుకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఇక వీటితో పాటు దుంపలు కూడా రక్త ప్రసరణను పెంచుతాయి. దుంపల్లో గుండె జబ్బులను తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని వాడటం ఉత్తమం.

దాంతో పాటు క్రాన్‌బెర్రీస్‌ జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఆంథోసైనిన్‌లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉన్నాయి ఈ జ్యూస్ లో. క్రాన్ బెర్రీస్ కు గుండె జబ్బులను నివారించే గుణం ఉంటుంది. దాంతో పాటు కొన్ని ప్రమాదకరమైన వ్యాధులను కూడా ఇవి తగ్గిస్తుంటాయి. కొలెస్ట్రాల్, రక్తపోటు మరియు రక్తం గడ్డకట్టడాన్ని అరికడుతాయి. దాంతో గుండెపోటు వచ్చేందుకు ఆస్కారం కూడా ఉండదు. ఇక వీటితో పటు దానిమ్మ రసంలో కూడా ఎన్నో ఔషధాలు ఉంటాయి. దాని వల్ల కూడా గుండె ఆరోగ్యం, రక్తం గడ్డకట్టడం నరాల ప్రేరణలకు సహాయపడే వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.

ఈ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం గడ్డటాన్ని, వాపు లాంటి సమస్యలను పూర్తిగా తగ్గిస్తాయి. కాబట్టి రక్త నాళాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈజీగా తగ్గించేస్తుంది. ఇక దానితో పాటు నారింజ రసం కూడా బాగానే పని చేస్తుంది. జీర్ణవ్యవస్థను కొలెస్ట్రాల్‌ను గ్రహించకుండా నిరోధించవచ్చు.

ఈ సిట్రస్ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫ్లేవనాయిడ్‌లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఇందులో ఉండే లక్షణాలు గుండె జబ్బులు రాకుండా నివారిస్తాయి. దాంఓత పాటు టొమాటో రసం కూడా గుండె జబ్బులను అరికడుతుంది. కాబట్టి వీటిని రోజులో ఎప్పడైనా సరే మీకు వీలున్నప్పుడు తీసుకుంటే బెటర్.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us