Jharkhand High Court :  15 ఏళ్ల అమ్మాయి పెళ్లికి హై కోర్టు అనుమతి

NQ Staff - December 1, 2022 / 06:53 PM IST

Jharkhand High Court  :  15 ఏళ్ల అమ్మాయి పెళ్లికి హై కోర్టు అనుమతి

Jharkhand High Court  : భారతదేశ చట్ట ప్రకారం 18 సంవత్సరాలు పూర్తయిన అమ్మాయిలకు మాత్రమే పెళ్లి చేయాల్సి ఉంటుంది. కానీ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 15 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతించింది.

ముస్లిం పర్సనల్ లా బోర్డు సూత్రాల ప్రకారం 15 సంవత్సరాల కు మించిన అమ్మాయిలు పెళ్లికి అర్హులు. అమ్మాయి పూర్తి అంగీకారం ఉంటే పెళ్లి చేసేందుకు పెద్దలకు అన్ని అర్హతలు అనుమతులు ఉంటాయి కనుక ఈ విషయమై కోర్టు ఎలాంటి జోక్యం చేసుకోదని న్యాయమూర్తులు తెలియజేశారు.

15 సంవత్సరాలు పూర్తి అయితే ఆ అమ్మాయి పెళ్లికి అనుమతిలిస్తున్నామంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. స్థానిక యువకుడు ఒకరు 15 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. ఆ పెళ్లి చెల్లదు అంటూ ఒక కేసు నమోదు అయింది.

ముస్లిం లా చట్టం ప్రకారం 15 సంవత్సరాల అమ్మాయి పెళ్లికి అర్హత ఉన్నట్లే.. కనుక అతడిపై కేసు చెల్లదు అంటూ అమ్మాయి తరఫు వాళ్లు పెట్టిన కేసును కోర్టు కొట్టి వేసింది. మొత్తంగా ముస్లిం అమ్మాయిలు 15 సంవత్సరాలు పూర్తి అయితే పెళ్లికి అర్హులు అన్నట్లుగా కోర్టు తీర్పునిచ్చింది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us