Jubliee hills case : జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితుల త‌ల్లిదండ్రుల‌తో పాటు ఇన్నోవా డ్రైవర్‌పై కేసు న‌మోదు

NQ Staff - June 15, 2022 / 06:45 PM IST

Jubliee hills case : జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితుల త‌ల్లిదండ్రుల‌తో పాటు ఇన్నోవా డ్రైవర్‌పై కేసు న‌మోదు

 

Jubliee hills case :కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పబ్ వద్ద పరిచమైన ఓ మైనర్ బాలికను కారులో తీసుకువెళ్లి ఇద్దరు యువకులు, మరో ముగ్గురు మైనర్ లు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర సంచలనం అయ్యింది. గత నెల 28వ తేదీన ఈ ఘటన జరగ్గా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు 31వ తేదీన కేసు నమోదు చేశారు.

కేసు న‌మోదు..

నిందితులు రాజకీయ పలుకుబడి ఉన్న నేతల కుమారులు కావడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడంతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు నిందితులకు సంబంధించి పలు ఆధారాలు మీడియాకు చూపి పోలీసు దర్యాప్తు తీరుపై మండిపడ్డారు.

JubileeHills-Gang-Rape-Case

ఐదు రోజుల పోలీస్​ కస్టడీలో మైనర్​ నిందితుల తీరు. పోలీస్ ​స్టేషన్​లో వాళ్ల ప్రవర్తనను చూసి పోలీసులే విస్మయానికి గురైనట్టు తెలుస్తోంది. విచారణ చేస్తున్నంతసేపూ వాళ్లలో పశ్చాత్తాపమే కనిపించలేదని విచారణ చేస్తున్న ఓ అధికారి చెప్పారు. ఎంజాయ్​మెంట్ మోజులోనే అమ్మాయిపై ఘాతుకానికి పాల్పడినట్టు మైనర్​ నిందితులు చెప్పారన్నారు. పోలీస్​ కస్టడీలో భాగంగా మంగళవారం కూడా మైనర్లను పోలీసులు విచారించారు.

మంగళవారంతో ముగ్గురి కస్టడీ పూర్తికాగా.. ఎమ్మెల్యే కొడుకు సహా ఇంకో మైనర్​ కస్టడీ బుధవారంతో ముగియనుంది. మైనర్​కు ఎమ్మెల్యే కుమార్తె బెంజ్​కారు ఇచ్చినట్టు విచారణలో తెలినట్లు, దీంతో ఆమెపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్​కు కారు ఇచ్చినందుకు వారి కుటుంబసభ్యులపైనా కేసులు పెట్టారు. అలానే ఇన్నోవా కారు డ్రైవ‌ర్‌పై కూడా కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తుంది.

బెంజ్​కారు, ఇన్నోవా పోలీసులకు దొరక్కుండా సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. వక్ఫ్​ బోర్డ్​ చైర్మన్​కు ప్రభుత్వం ఎలాంటి వాహనాన్ని కేటాయించలేదని పోలీసులు తేల్చారు. తన సొంత కారుకే గవర్నమెంట్​ స్టిక్కర్​ వేసుకున్నట్టు నిర్ధారించారు. ఇన్నోవా డ్రైవర్​ స్టేట్​మెంట్​నూ రికార్డ్​ చేసిన పోలీసులు.. ఘటన జరిగిన రోజు ఎవరెవరూ ప్రయాణించారన్న విషయాలను రాబట్టారు. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో చార్జిషీటు, బాధితురాలికి న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఓ అధికారి తెలిపారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us