ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో విలన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Advertisement

ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక గుర్తింపు సంపాధించుకొని టాప్ హీరో లో ఒకడిగా కొనసాగుతున్నాడు. రెండు వరుస హిట్ ల తరువాత ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం లో మల్టీ స్టారర్ మూవీ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. ఇక ఈ సినిమా విడుదల కాకముందే ఈ సినిమా పైన ప్రేక్షకులకు ఊహాగానాలు తారాలనంటేశాయి . అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రతి సినిమా కథ ని ఆచి తూచి ఎంచుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వం లో మరొక సినిమా ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు

ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఆ సినిమా పైన కూడా మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఆ ఎక్సపెక్ట్షన్స్ ఏ మాత్రం తగ్గకుండా ఉండేవిధంగా ఈ సినిమా ను మరియు ఈ సినిమాలో ని కారక్టర్స్ ని సిద్ధం చేసుకుంటున్నాడు అంట త్రివిక్రమ్ శ్రీనివాస్… మంచి ఫాల్లోవింగ్, మాస్ మరియు ఫామిలీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుకున్న హీరో లు ఒక్క సారి విలన్ లు గా మారితే ఆ సినిమా కి ఉండే క్రేజ్ ఏ వేరు అదే విషయాన్నీ బోయపాటి లెజెండ్ సినిమాతో జగపతి బాబు ని విలన్ గా పరిచయం చేసి చూపించాడు. … ఆలా మరొక ట్రెండ్ సెట్టర్ విల్లన్ ని ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేసేటువంటి ఎన్టీఆర్ 30 వ సినిమా అయిన అయినను పోయి రావాలె హస్తినకు ( వర్కింగ్ టైటిల్ ) తీసుకోనున్నట్లు సమాచారం

ఇంతకు ఎవరా ఆ హీరో అనుకుంటున్నారా అందరి ని తన నవ్వు తో ఆకట్టుకొనే ఫామిలీ అండ్ మాస్ హీరో అయినటువంటి మంచు మనోజ్ .. అవునండి హీరో మంచు మనోజ్ ని అయినను పోయి రావాలె హస్తినకు అన్న సినిమాలో విలన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దానికి సంబంధించిన సంప్రదింపులు కూడా మంచు మనోజ్ తో జరపనున్నట్లు సమాచారం . మరి ఇప్పటి వరకు హీరో లలో అన్ని రకాల యాంగిల్స్ ట్రై చేసిన మనోజ్ విలన్ గా ఎన్టీఆర్ కి నటిస్తే ఎలా ఉంటుందో.. వీరిద్దరి కాంబో కూడా లెజెండ్ ల ట్రెండ్ సృష్టిస్తుందా లేదో చూడాలంటె ఆ సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here