ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ అప్డేట్ ఇచ్చిన మూవీ టీం

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రానికి త్రి విక్రమ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని హారిక-హాసిని క్రియేషన్స్‌, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్-త్రి విక్రమ్ కలిసి చేస్తున్నారనే విషయం తప్ప మరే ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ ను మూవీ టీం వెల్లడించింది.

ఎన్టీఆర్-త్రి విక్రమ్ మూవీ అప్డేట్ కోసం మీరు చేస్తున్న మెసేజ్స్ ను మేము చూస్తున్నాం. ఒక్కసారి మూవీ స్టార్ట్ అయిన తరువాత అప్పుడు టైటిల్ ను రివీల్ చేస్తామని, టైటిల్ ను చెప్పడం కూడా తమకు సెంటిమెంటని, మూవీ స్టార్ట్ అయిన తరువాతే టైటిల్ చెప్తామని వెల్లడించారు. అలాగే ఈ మూవీని గొప్పగా నిర్మించేందుకు కృషి చేస్తామని మూవీ టీం తెలిపారు. ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులుకు ఎలాంటి అప్డేట్స్ అప్పుడే ఇవ్వమని చెప్పే అప్డేట్ .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here