Jr NTR : ఎన్టీఆర్ స్టైలిష్ లుక్.. ఆయన పెట్టుకున్న వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..?
NQ Staff - March 16, 2023 / 10:10 AM IST

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలను దాటుతోంది. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన జూనియర్.. ఇప్పుడు ఆస్కార్ కూడా రావడంతో ఆయన ఇమేజ్ ఖండాంతరాలను దాటుతోంది. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో ఆయన పేరు వినిపిస్తోంది.
కాగా జూనియర్ ఎన్టీఆర్ ఏ ఈవెంట్ కు వెళ్లినా సరే అక్కడకు కొత్త కొత్త వాచ్ లను పెట్టుకుని వెళ్తుంటాడు. ఆయనకు వాచ్ లు అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. గతంలో కూడా ఆయన త్రిబుల ఆర్ ప్రమోషన్స్ లో కోట్లాది రపాయల విలువ చేసే వాచీలను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆస్కార్ ఈవెంట్ కు కూడా ఆయన స్టైలిష్ లుక్ లో వెళ్లారు.

Jr NTR Latest Stylish Look Photos
దాని ఖరీదు ఎంతంటే..?
ఈ లుక్ కు సంబంధించిన ఫొటోలను తారక్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆయన చేతికి ఉన్న వాచీ గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ఈ వాచీ చాలా ఖరీదైనదిగా తెలుస్తోంది. పటేక్ ఫిలిప్ బ్రాండెడ్ కు చెందినది. దీని ఖరీదు రూ.కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది.

Jr NTR Latest Stylish Look Photos
ఇలా కోట్ల విలువ చేసే వాచీలు కొనుక్కోవడం తారక్ కు ఎంతో ఇష్టం. గతంలో కూడా ఆయన ఓ ప్రెస్ మీట్ లో రూ.4కోట్ల విలువ చేసే వాచీని ధరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.