Jr NTR : జూనియర్‌ ఎన్టీఆర్‌కు పోటీగా తారకరత్న సినిమాల్లోకి వచ్చాడా.. వెనకున్నదెవరు..?

NQ Staff - January 30, 2023 / 01:45 PM IST

Jr NTR : జూనియర్‌ ఎన్టీఆర్‌కు పోటీగా తారకరత్న సినిమాల్లోకి వచ్చాడా.. వెనకున్నదెవరు..?

Jr NTR : నందమూరి ఫ్యామిలీకి టాలీవుడ్‌ లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. సీనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చి అందరికంటే టాప్‌ పొజీషన్‌కు ఎదిగిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే నందమూరి హీరోల్లో తారక్‌కు ఉన్న ఫాలోయింగ్ ఇంకెవరికీ లేదనే చెప్పుకోవాలి. అయితే మొదట్లో తారక్‌ను నందమూరి ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోలేదు.

ఆ క్రమంలోనే సీనియర్‌ ఎన్టీఆర్‌ మరో మనవడు అయిన తారకరత్న ను కూడా సినిమాల్లోకి తీసుకువచ్చారు. దాంతో ఆయన్ను జూనియర్‌ ఎన్టీఆర్‌కు పోటీగానే దింపారని అందరూ అనుకున్నారు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన తారకరత్న.. ఆ తర్వాత ఏకంగా 13 సినిమాలను ఒప్పుకున్నాడు. కానీ అందులో ఏవీ హిట్ కాకపోవడంతో త్వరగానే ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు.

క్లారిటీ ఇచ్చిన తారకరత్న..

అయితే గతంలో ఆయన నటించిన ‘9 అవర్స్’ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ లో ఈ రూమర్లపై తారకరత్న స్పందించాడు. నేను జూనియర్‌ ఎన్టీఆర్‌ కు పోటీగా సినిమాల్లోకి వచ్చానని అంతా అనుకున్నారు. కానీ అందులో నిజం లేదు. నందమూరి బిడ్డగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను.

నా తమ్ముడు తారక్‌ను నేను ఎప్పుడూ పోటీగా భావించలేదు. ఈ రోజు అభిమానుల్లో మాకు ఇంకా పేరుంది అంటే అందుకు తారక్‌ కూడా ఒక పెద్ద కారణం. నేను అప్పుడప్పుడు తారక్‌ ను కలుస్తూ ఉంటాను అంటూ క్లారిటీ ఇచ్చాడు తారకరత్న. ఇక తాజాగా ఆయన గుండెపోటు కారణంగా కోమాలోకి వెళ్లిన సంతగి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us