Jr NTR : ఆ రాజకీయ నేత వల్లే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాడని మీకు తెలుసా..?
NQ Staff - June 6, 2023 / 12:56 PM IST

Jr NTR : అవును మీరు విన్నది నిజమే. జూనియర్ ఎన్టీఆర్ నేడు స్టార్ హీరో అయ్యాడు అంటే అది ఓ రాజకీయ నేత వల్లే. ఆ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదేంటి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడు కదా.. ఆయన తండ్రి వల్లే పెద్ద డైరెక్టర్లు ఆయనతో సినిమాలు చేశారు కదా అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ మొదటి మూవీ నిన్ను చూడాలని. ఈ మూవీ ఆకట్టుకోలేదు. దాని తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ చేశాడు. ఇది మంచి హిట్ అయింది. కానీ దాని తర్వాత చేసిన సుబ్బు ఫెయిల్ అయింది. కానీ వీవీ వినాయక్ తో చేసిన ఆది మంచి హిట్ అందుకుంది. కానీ అప్పటికి ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే నిరూపించుకున్నాడు. బ్యాడ్ లక్ ఏంటంటే.. దీని తర్వాత ఆయన చేసిన అల్లరి రాముడు, నాగ దారుణంగా అట్టర్ ప్లాప్ అయ్యాయి.
దాంతో ఎన్టీఆర్ కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. దాంతో జూనియర్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. అప్పటికే కొడాలి నాని ఎన్టీఆర్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఆ సమయంలో కొడాలి నాని ఎన్టీఆర్ కు ఓ సలహా ఇచ్చాడు. ఇక నుంచి నువ్వు కమర్షియల్ సినిమాలే చేయాలి తప్ప లవ్ స్టోరీలు చేస్తే స్టార్ హీరోవు కాలేవని చెప్పాడు.

Jr NTR Became Star Hero With Kodali Nani Advice
దాంతో జూనియర్ కూడా ఈ సారి ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని కసితో చాలా కథలు విన్నాడు. ఓ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ బాగా రావట్లేదని మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత దాదాపు 50కి పైగా కథలు విన్నాడు. కానీ ఏదీ నచ్చలేదు. ఆ సమయంలోనే రాజమౌళి సింహాద్రి కథను ఎన్టీఆర్ కు వినిపించాడు.
కథ విని ఎన్టీఆర్ ఎగిరి గంతేశాడు. నాకు కావాల్సింది ఇలాంటి కథనే అని చెప్పాడు. అదే కథను కొడాలి నాని కూడా చెప్పించాడు. కానీ కొడాలి కొన్ని సీన్లను మార్చాలని చెప్పాడంట. ఎలాగైనా ఎన్టీఆర్ కు మాస్ హీరో ముద్ర పడాలని రాజమౌళికి చెప్పాడు. దాంతో రాజమౌళి కూడా హీరో ఎలివేషన్ సీన్లను రాసుకుని సినిమాను తీశాడు. దెబ్బకు ఇండస్ట్రీ హిట్ అయిపోయింది.
అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేసింది. కొడాలి కోరుకున్నట్టే ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు జూనియర్. కొడాలి సలహా వల్లే ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాడు.