JR NTR: ఎన్టీఆర్ సంతకం ఫొటో వైర‌ల్‌.. ఆసక్తిగా గ‌మ‌నిస్తున్న ఫ్యాన్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పాకుతుంది. అభిమానుల‌ని ప్రాణంగా భావించే ఎన్టీఆర్ వారిని క‌లుసుకునేందుకు చాలా ఆస‌క్తి చూపుతుంటారు. కొన్ని సంద‌ర్భాల‌లో క‌ల‌వ‌డం కుదురుతుంది, మ‌రి కొన్ని సంద‌ర్భాల‌లో కుద‌ర‌క‌పోవ‌చ్చు. రీసెంట్‌గా స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కన్వీనర్ భాస్కర్ చౌదరి త‌న కుమారుడి పెళ్లికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించేందుకు జూనియ‌ర్ ఇంటికి వెళ్లాడు.

పెళ్లి కార్డు పట్టుకొని కుటుంబ సమేతంగా వెళ్లిన భాస్క‌ర్‌కు తార‌క్ ఘ‌న స్వాగతం ప‌లికాడు. కొద్ది సేపు వారితో ముచ్చ‌టించాడు. త‌ప్ప‌కుండా పెళ్లికి వ‌స్తాన‌ని మాట ఇచ్చాడు. అలానే వెళ్లేప్పుడు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడ‌ట‌. ఇప్పుడు ఆ ఆటోగ్రాఫ్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చేస్తుంది. సంత‌కాన్ని నెటిజ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.కాగా, ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న యంగ్ టైగ‌ర్ త్వ‌ర‌లో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 30వ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్, బుచ్చిబాబు, త్రివిక్ర‌మ్, ప‌ర‌శురాం ద‌ర్శ‌కత్వంలోను ఎన్టీఆర్ సినిమా చేయ‌నున్నాడు.

Advertisement