Teenmar Mallanna: టీడీపీ అధ్య‌క్షుడిగా తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. చంద్ర‌బాబు ఇచ్చిన మొత్తంతోనే స్క్రీన్ కొన్నాడు

Teenmar Mallanna: ఒక‌ప్పుడు టీవీ ఛానెల్‌లో క‌నిపించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన మ‌ల్ల‌న్న.. ఆ కార్య‌క్ర‌మంతో తీన్మార్ మ‌ల్ల‌న్న‌గా మారాడు. ఆ త‌ర్వాతా సోష‌ల్ మీడియాని ఉపయోగించుకొని నాయ‌కుడిగా ఎదిగాడు. ముఖ్యంగా టీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై నిప్పులు చెర‌గుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. తాజాగా ఆయన క్యూ న్యూస్ ఛానెల్ ఛీఫ్ బ్యూరో మ‌ల్ల‌న్న‌పై సంచ‌న‌ల ఆరోప‌ణ‌లు చేశారు. ఇవి చ‌ర్చ‌నీయాంశంగా మ‌రాయి.

Teenmar Mallanna

క్యూ న్యూస్ చీఫ్ బ్యూరో, జర్నలిస్ట్ చిలుకా ప్రవీణ్ .. మ‌ల్ల‌న్న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశాడు. దళిత, బహుజన వాదం ముసుగులో అంతులేని అవినీతికి పాల్పడుతున్నాడని.. ఎన్నికల వేళ అన్ని పార్టీల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నాడని వెల్లడించారు. తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఛోటా నయింగా మారారని సంచలనం రేపారు. చంద్ర‌బాబు నాయుడి వ‌ద్ద కూడా మ‌ల్ల‌న్న డబ్బులు వ‌సూలు చేశార‌ని ప్ర‌వీణ్ షాకింగ్ విష‌యాలు చెప్పారు.

15 రోజుల క్రితమే చంద్రబాబు ద‌గ్గ‌ర‌ డబ్బు తీసుకొచ్చుకున్నడు. ఇంతకు ముందు పేపర్ పెట్టి చదివేటోడు.. ఇప్పుడొక స్క్రీన్ పెట్టి చదువుతున్నాడు తీన్మార్ మల్లన్న. ఈ స్క్రీన్‌కి రూ. 6 లక్షల ఖర్చు అయింది.తెలంగాణ‌లో తెలుగుదేశం ప‌ని ఖ‌తం అయింది. మ‌ల్ల‌న్న‌రోజుగ‌ట్టిగా మొరుగుతుండ‌డంతో చంద్రబాబు అత‌నిని న‌మ్మిండు. త‌న‌ను టీడీపీ అధ్య‌క్షుడిగా తీసుకోవాల‌ని చంద్ర‌బాబు అనుకున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని మాకు చెప్పాడు

మల్లను చంద్రబాబు నమ్మి రూ. 10 లక్షల చెక్ ఇచ్చారు. ఈ డబ్బుల్లో రూ. 6 లక్షల పెట్టి టీవీ తెచ్చుకున్నారు. దాన్ని పెట్టుకుని ఇప్పుడు తీన్మార్ మల్లన్న వార్తలు చదువుతున్నాడు.’’ అని ప్రవీణ్ అన్నారు. తామేమీ కేటీఆర్, రేవంత్ అనుచరులం కాదని.. ఎన్నికల వేళ కాంగ్రెస్ వాళ్ల దగ్గర, బీజేపీ బండి సంజయ్ దగ్గర, అర్వింద్ దగ్గర అందరి దగ్గర తీన్మార్ మల్లన్ననే డబ్బులు తెచ్చుకున్నాడని ఆరోపించారు. రానున్న రోజుల‌లో ఓడిపోయిన ముఖ్య‌మంత్రితో, మాజీ మంత్రితో చేసుకున్న డీల్ వివ‌రాలు బ‌య‌ట‌పెడ‌తా.

వందల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని.. నిన్న కూడా ఆయన క్యాబిన్‌లో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయని.. ఇంటికెళ్తే దొరుకుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న టీం స్టేట్ ఆర్గనైజర్ అశోక్ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లన్న సిద్ధాంతాలు నమ్మి వచ్చానని.. కానీ, అతడి టీంలో తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. తీన్మార్ మల్లన్న ఓ దొంగ అని మండిపడ్డారు. ఓ మహిళను ను బెదిరించి.. డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. తీన్మార్ మల్లన్న బాగోతం త్వరలో బయట పెడతామని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న తెలంగాణలో ఛోటా నయీం మాదిరిగా తయారయ్యాడని, అతడి ఆగడాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.