Pujara: ఖాతా తెర‌వ‌డానికి 36 బంతులు.. పేలుతున్న జోకులు

Pujara: క్రికెట్ పూర్తిగా మారిపోయింది. ఒక‌ప్పుడు టెస్ట్ మ్యాచ్‌లు, వ‌న్డేల‌కు ఫుల్ క్రేజ్ ఉండేది. టీ 20లు వ‌చ్చాక వాటికి క్రేజ్ త‌గ్గింది. అయితే టెస్ట్ మ్యాచ్‌ల‌పై మ‌రింత క్రేజ్ పెంచేందుకు బీసీసీఐ స‌రికొత్త‌గా ప్లాన్స్ వేస్తుంది. అయితే టెస్ట్ క్రికెట్ లో రాణించాలంటే ఎంతో మెరుగైన ఆట తీరు ఉండాలి. ఒక‌ప్పుడు ఇండియన్ టీంలో ద్ర‌విడ్ అత్య‌ద్భుతంగా ఆడుతూ మిస్ట‌ర్ వాల్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ద్ర‌విడ్ బాట‌లోనే పుజారా ప‌య‌నిస్తున్నాడు.

Cheteshwar Pujara

న‌యా వాల్ చెటేశ్వ‌ర్ పుజారా ఈ మ‌ధ్య ఆడుతున్న తీరు చాలా మందికి మింగుడు ప‌డ‌టం లేదు. మ‌రీ నిదానంగా బ్యాటింగ్ చేస్తూ బోర్ కొట్టిస్తున్నాడు. ఆయ‌న‌పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో దినేష్ కార్తిక్ స్పందిస్తూ.. పుజారా ఎక్కువ ప‌రుగులు చేయ‌కపోయినా కూడా ఎక్కువ స‌మ‌యం బ్యాటింగ్ చేసి విజ‌యం అందిస్తున్నాడని అన్నారు. ప్ర‌స్తుతం దినేష్ ఐసీసీ టెస్ట్ చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Cheteshwar Pujara

పుజారని ఔట్ చేసేందుకు బౌల‌ర్స్ ఎంత‌గా ఇబ్బందులు ప‌డ‌తారో ప్ర‌త్య‌కించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. బౌల‌ర్స్ ప‌దునైన బంతులు వేసిన‌ప్ప‌టికీ ఏ మాత్రం బెద‌ర‌కుండా పుజారా ఆడుతున్నాడు. ఒక్కోసారి త‌ల‌కి దెబ్బ‌లు త‌గిలిన కూడా బెద‌ర‌డం లేదు. ఆయ‌నకు త‌గిలిన దెబ్బ‌ల‌కు లేక్కేలేదు. అయితే ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌న తొలి ప‌రుగు చేయ‌డానికి ఏకంగా 36 బంతులు తీసుకున్నాడు. 36వ బంతికి ఫోర్ కొట్టి పుజారా ఖాతా తెరిచాడు.

త‌ర్వాతి బంతిని కూడా ఫోర్ కొట్టిన పుజారా వ‌రికి 54 బంతుల్లో 8 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అత‌ని ఇన్నింగ్స్‌పై ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్‌లో జోక‌లు పేలుతున్నాయి.పుజారా బ్యాటింగ్ చేస్తే నాన్ స్ట్రైక‌ర్ అల‌సిపోయి ప‌డిపోతాడ‌ని, బౌల‌ర్స్ సెలైన్స్ పెట్టుకొని బౌలింగ్ వేయాల‌ని, త‌ర్వాతి బ్యాట్స్ మెన్స్ కునుకు తీయోచ్చు అన్న‌ట్టు మీమ్స్ క్రియేట్ చేశారు.

Cheteshwar Pujara

ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో కేవలం నిమిషాల వ్యవధిలోనే వాతావరణం మారిపోతూ ఆటగాళ్లకి సవాల్ విసురుతోంది.తొలి రోజు ఆట ర‌ద్దు కాగా, రెండో రోజు కూడా త‌క్కువ ఓవ‌ర్స్ న‌డిచాయి. ఈ రోజు వాతావ‌రణం కూడా వ‌ర్షం ప‌డేలా క‌నిపిస్తుంది.మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు.. ఆటని అంపైర్లు నిలిపివేసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 146/3తో నిలిచింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్: 124 బంతుల్లో 1×4), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (29 బ్యాటింగ్: 79 బంతుల్లో 4×4) ఉన్నారు.