Job Notifications : తెలంగాణలో కొలువుల జాతర.. మరో 10వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

NQ Staff - June 17, 2022 / 09:59 PM IST

Job Notifications : తెలంగాణలో కొలువుల జాతర.. మరో 10వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

Job Notifications : తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 10, 105 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. బీసీ గురుకులాల్లో 3,870 , గిరిజన గురుకులాల్లో 1,514 , ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.

Job Notifications in telangana

Job Notifications in telangana

ఎస్సీ అభివృద్ధి శాఖలో 316, మహిళా శిశుసంక్షేమ శాఖలో 251, బీసీ సంక్షేమ శాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగశాఖలో 71, జువైనల్ వెల్ఫేర్ లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్ పీఎస్పీ ద్వారా భర్తీ చేయనున్నారు.

మహిళా శిశుసంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.తాజా అనుమతితో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఉద్యోగాల భర్తీ అంశాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొందరు చేసే ఉద్యోగ ప్రకటనలు జుమ్లా మాత్రమేనని హరీశ్ రావు.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చినట్టు చెప్పారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us