Joanna Cox : రోజులో 22 గంటలు పడుకునే లేడీ కుంభకర్ణ
NQ Staff - March 4, 2023 / 07:30 PM IST

Joanna Cox : ఆమె వయసు 38 ఏళ్లు. ఆమె రోజులో 22 గంటలు కచ్చితంగా నిద్ర పోవాల్సిందే. అలా నిద్ర పోకుంటే ఎక్కడ ఉంటే అక్కడే నిద్ర ముంచుకొస్తుంది. స్లీపింగ్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమె పేరు జోఅన్నా కాక్స్. 2017 సంవత్సరానికి ముందు వరకు ఉద్యోగం చేసేది. కానీ ఆఫీస్ లో నిద్ర రావడంతో పాటు అస్సలు పని పై దృష్టి పెట్టలేక ఉద్యోగాన్ని వదిలేసింది.
రోజులో 22 గంటల పాటు నిద్ర పోకుంటే ఆమె ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుందట. అంతే కాకుండా పార్టీకి వెళ్లినా.. ప్రయాణిస్తున్నా కూడా నిద్ర ఆపుకోలేదు. ఎంత పార్టీలో ఉన్నా కూడా నిద్రను ఆపుకోలేదు. సాదారణంగా అయితే రోజులో 8 గంటలు నిద్ర పోతే పర్వాలేదు కానీ ఆమె మాత్రం 22 గంటలు పడుకోవాల్సిందే.
రోజులో కేవలం రెండు గంటలు మాత్రమే ఆమె మెలుకువతో ఉంటుంది. ఒకొక్క సారి మూడు నాలుగు రోజుల పాటు కూడా ఆమె పడుకుని ఉంటుందట. ఆమెకు కనీసం వండుకునే అలవాటు కూడా లేదట. ఎప్పుడు కూడా పడుకునే ఉంటుంది.
నిద్ర లేవగానే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తిని మళ్లీ పడుకుంటుందట. ఈ సమస్యను ఇడియోపతిక్ హైపర్ సోమ్నియా అంటూ వైధ్యులు నిర్థారించారు. ప్రస్తుతానికి ఈ రోగానికి ఎలాంటి మందులు లేవని.. భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనేది చూడాలి.