ఐపీల్ స్పాన్సర్ షిప్ కోసం పోటీపడుతున్న జియో, పతాంజలి.

Advertisement

ఐపీల్ స్పాన్సర్ షిప్ నుండి చైనా కు చెందిన వివో సంస్థ స్వచ్ఛదంగా తప్పుకుంటున్నట్టు ఆ సంస్థనే తెలిపింది. అయితే కొత్తగా ఐపీల్ 2020 కి ఎవరు స్పాన్సర్ షిప్ వహించబోతున్నారు అని ప్రతి ఒక్కరు సందేహపడుతున్నారు. ఇప్పటికే కొత్త స్పాన్సర్ షిప్ కోసం బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఐపీల్ సీజన్ దగ్గర పడుతుండడంతో స్పాన్సర్ షిప్ వెతకడంలో చాలా బిజీగా ఉంది బీసీసీఐ.

ఇది ఇలా ఉంటె తాజాగా ఐపీల్ 2020కి స్పాన్సర్ షిప్ కోసం భారత్ కి చెందిన జియో మరియు పతాంజలి సంస్థలు పోటీపడుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు ఎలాగైనా భారతీయ కంపెనీలనే స్పాన్సర్ షిప్‌గా నియమించుకోవాలని బీసీసీఐ ఆలోచనలో ఉందని సమాచారం వస్తుంది. చూడాలి మరి ఐపీల్ 2020 సీజన్ కు స్పాన్సర్ షిప్ ఎవరు వహించబోతారో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here