రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఝార్ఖండ్ సీఎం

Advertisement

ఝార్ఖండ్: భాజపా ఎంపీ డాక్టర్‌ నిషికాంత్‌ దూబె తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావాను రాంచీ సివిల్ కోర్టులో దాఖలు చేశారు. ఆగస్టు 4న నమోదైన ఈ కేసులో ఆశ్చర్యం ఏంటంటే సీఎం హేమంత్ ఫేస్ బుక్ ఇండియా, ట్విట్టర్ ఇండియాలపై కూడా పరువు నష్టం దావా వేశారు. అసత్య వార్తలను అనుమతిస్తున్నందుకు, తొలగించన్నందుకు కేసులో వాటిని కూడా చేర్చానని హేమంత్ తెలిపారు.

గోడ్డా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దూబె, వివిధ అంశాలను గురించి ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలకు పాల్పడ్డారు. సోరెన్‌ 2013లో ముంబయిలో ఓ మహిళను అపహరించి, అత్యాచారానికి పాల్పడినట్టు ఆయన ట్విటర్‌ వేదికగా ఆరోపించారు. హేమంత్ వేసిన కేసుపై దూబె స్పందిస్తూ…న్యాయపరంగా పోరాటం చేయడానికి అవకాశం ఇచ్చిన్నందుకు ధన్యవాదాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here