Court : సంచలనం: భార్య నగలపై కన్నేస్తే, భర్తది తప్పే.!
NQ Staff - January 2, 2023 / 11:03 AM IST

Court : ఆర్థిక అవసరాల నిమిత్తం భార్య నగలపై కన్నేశారా.? అయితే, వ్యవహారం కోర్టుకెక్కొచ్చు.! ఎందుకంటే, భార్య నగల మీద సంపూర్ణాధికారం భర్తలకు లేదు మరి.!
అసలు విషయమేంటంటే, భార్యా భర్తల మధ్య నగల పంచాయితీ కోర్టుకెక్కింది. ఈ విషయంలో భర్తనే తప్పు పట్టింది న్యాయస్థానం. భర్తకి ఝలక్ ఇచ్చింది, భార్యకు మద్దతుగా నిలిచింది ఉన్నత న్యాయస్థానం.
భార్య నగలు.. ఆమె వ్యక్తిగత ఆస్తి..
ఉన్నత న్యాయస్థానమొకటి, ‘భార్య నగలపై భర్త కన్నేస్తే..’ అన్న అంశంపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది. భార్య నగలు, ఆమె వ్యక్తిగత ఆస్తి అని హైకోర్టు స్పస్టం చేసింది. ‘భర్త అయినాసరే, ముందస్తు అనుమతి లేకుండా నగలు తీసుకోకూడదు’ అని తేల్చి చెప్పింది.
కేసు వివరాల్లోకి వెళితే, ఢిల్లీ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా ‘భార్య నగలు – భర్త కన్నేయడం’ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. తీర్పు సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
ప్రస్తుతం కేసు విచారణ ప్రాథమిక దశలోనే వుంది. తనను అరెస్టు చేయొద్దని నిందితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ముందస్తు బెయిల్ సాధ్యం కాదని తేల్చి చెప్పింది న్యాయస్థానం.