JD Chakravarthy : విష్ణుప్రియ నాతో ప్రేమలో పడింది.. ఓపెన్ అయిన జేడీ చక్రవర్తి..!
NQ Staff - June 18, 2023 / 01:07 PM IST

JD Chakravarthy : జేడీ చక్రవర్తి ఈ నడుమ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. అందులో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తూ సంచలనం రేపుతున్నారు. గతంలో హీరోగా చాలా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. కానీ ఎందుకో స్టార్ హీరో కాలేకపోయారు. హీరోగా కూడా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయారు.
దాంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. ఇప్పుడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే గతంలో ఓ షోలో యాంకర్ విష్ణుప్రియ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. జేడీ చక్రవర్తి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటూ తెలిపింది. ఇదే విషయంపై తాజాగా జేడీ చక్రవర్తి స్పందించారు.
యాంకర్ విష్ణుప్రియ నేను కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించాం. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం పెరిగింది. ఆమె నాతో మరిన్ని సినిమాల్లో నటించాలని ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ కూడా చెప్పారు. అందుకోసం నా సినిమాలను చూడమని ఆమెకు చెప్పారు. అలా ఆమె నా పాత్రలతో ప్రేమలో పడిపోయింది.
అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టు మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. మేం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. ఆమెకు మంచి భవిష్యత్ ఉంది. ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మేం ఇద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది అంటూ తెలిపాడు జేడీ చక్రవర్తి. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.