JD Chakravarthy : నా భార్య నాకు పాయిజన్ ఇచ్చింది.. జేడీ చక్రవర్తి సంచలనం..!
NQ Staff - June 18, 2023 / 11:28 AM IST

JD Chakravarthy : నటుడిగా జేడీ చక్రవర్తికి మంచి పేరుంది. ఆయన చేసిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. చాలా సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. అప్పట్లో ఆయన హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇందులో తన భార్య తనకు స్లో పాయిజన్ ఇచ్చినట్టు ఆరోపించారు. నేను గతంలో బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో చాలా బాధ పడ్డాను. నాకు సిగరెట్, డ్రగ్స్ లాంటి అలవాట్లు లేవు. మరి నాకెందుకు వచ్చిందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఇండియా, శ్రీలంక ఇలా చాలా దేశాలు తిరిగాను. నా ఫ్రెండ్ ఉత్తేజ్ కూడా చాలామంచి డాక్టర్లకు చూపించాడు.
కానీ ఎవరూ కారణాన్ని కనుక్కోలేకపోయారు. చివరకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ప్రొడ్యూసర్ నాకు మంచి బాల్యమిత్రుడు. అతను నన్ను నాగార్జున అనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన చాలా రకాల టెస్టులు చేసి నా బాడీలోకి గత 8 నెలలుగా స్లో పాయిజన్ ఎక్కిస్తున్నట్టు తెలిపాడు. నేను తీసుకుంటున్న కషాయంలోనే పాజియన్ ఉన్నట్టు చెప్పాడు.
దాంతో షాక్ అయిపోయాను. నా భార్య నాకు ఇలా పాయిజన్ ఇప్పిస్తుందని తెలుసుకుని చాలా బాధ పడ్డాను. నాకు ఎలాంటి అలవాట్లు లేవు కనక నా బాడీ స్లో పాయిజన్ ను రిసీవ్ చేసుకుంటోంది అంటూ తెలిపాడు జేడీ చక్రవర్తి. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.