JD Chakravarthy Bold Comments On Vishnu Priya : విష్ణుప్రియ ఫిజిక్ కత్తిలా ఉంటుంది.. అందుకే వెబ్ సిరీస్ లో పెట్టుకున్నా.. జేడీ చక్రవర్తి..!
NQ Staff - August 5, 2023 / 10:34 AM IST

JD Chakravarthy Bold Comments On Vishnu Priya :
యాంకర్ గా విష్ణుప్రియకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె సినిమాల మీద దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన వెబ్ సిరీస్ దయా. పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ లో జేడీ చక్రవర్తి లీడ్ రోల్ లో నటించారు. అయితే ఇందులో నటించిన విష్ణుప్రియ జేడీ చక్రవర్తిపై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
జేడీ చక్రవర్తి చాలా మంచి వ్యక్తి అని.. అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విష్ణుప్రియ మాట్లాడుతూ… పవన్ సాదినేని టార్చర్ పెడుతారని నాకు ముందే కొందరు చెప్పారు.
యాక్టింగ్ రాకపోయినా..
కానీ మంచి టీమ్ తో పని చేసే అవకాశాన్ని మిస్ కావొద్దని నేను సిరీస్ చేశాను అంటూ చెప్పింది. అనంతరం జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ లో ఓ జర్నలిస్ట్ పాత్రను విష్ణుప్రియకు ఇచ్చాం. వాస్తవంగా ఆ పాత్రకు యాక్టింగ్ రాకపోయినా సరే ఫిజిక్ కత్తిలా ఉండాలని మేం ఫిక్స్ అయ్యాం.
అందుకే విష్ణుప్రియను తీసుకున్నాం. ఆమెది చైల్డ్ మెంటాలిటీ. ఆమె ఏం చేసినా మేం ఎంజాయ్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే విష్ణుప్రియకు యాక్టింగ్ రాదని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ వెబ్ సిరీస్ విష్ణుప్రియకు మంచి అవకాశాలు తెస్తుందని ఆమె భావిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.