JC Diwakar Reddy : చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు.. పార్టీ కి తలనొప్పులు తెచ్చేలా జేసీ వ్యాఖ్యలు..!!

JC Diwakar Reddy : రాజకీయ రంగంలో సంచలనం జేసీ దివాకర్ రెడ్డి. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలీదు.. ఎవరికో కాదు ఆయనకు కూడా తెలీదు.. ఏపీ లో అత్యంత వివాదాస్పదమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది జేసీ అని చెప్పొచ్చు.. అయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై సంచలన వ్యాఖ్యలు చేసిన దివాకర్ రెడ్డి సొంత పార్టీ పై, పార్టీ అధినేత అని చూడకుండా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయన ఏ పార్టీ లో ఉన్నా నచ్చకపోతే అంతే..ఎదురుగ ఉన్నది ఎవరన్నది చూడకుండా విమర్శిస్తారు..

JC Diwakar Reddy Sensational Comments on Chandra Babu : జేసీ
JC Diwakar Reddy Sensational Comments on Chandra Babu

ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ లో ఉన్న జేసీ దివాకర్ చంద్రబాబు పై కూడా కొన్ని కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేస్తారు.. జగన్ ని పొగిడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.. కోపమొస్తే చంద్రబాబు పైనా నోరేసుకుని పడిపోతారు. తాజాగా మళ్ళీ చంద్రబాబు పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు పొలిటికల్ లో హాట్ టాపిక్ గా మారింది. పంచాయితీ ఎన్నికల తర్వాత పార్టీ లో నెలకొన్న పరిస్థితి పై తనదైన శైలి లో స్పందించారు. టీడీపీ ని అడ్డుకోవడానికి జగన్ ఏ దారిలో అయినా వెళతాడని హెచ్చరించినా చంద్రబాబు వినలేదని అన్నారు.

ఇప్పటికే చంద్రబాబు పై కేసులు నమోదు చేయడం ఆలస్యమైందన్న జేసీ జగన్ తనకు ప్రధమ శత్రువు కాదన్నాడు. నేను చంద్రబాబు ను ద్వేషించే వ్యక్తి ని అన్నారు. చంద్రబాబు జగన్ లలో ఎవరి బెస్ట్ అన్నది మీమాంస లో ఉండగా విధిలేక చంద్రబాబు చెంతకు వెళ్లానన్నారు. విమర్శిస్తూనే చంద్రబాబు ను ప్రశంశిచారు. చంద్రబాబు విజన్ ఉన్న నేత అని, అందుకే ఆయనంటే అభిమానమంటూ తమ్ముళ్లకు కాస్త ఊరటనిచ్చే కామెంట్స్ చేశారు. ఇక తిరుపతి ఉప ఎన్నికపై మాట్లాడుతూ . తిరుపతిలో గెలుపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. ఇది టీడీపీ ని కంగు థింపించిందని చెప్పొచ్చు.ఇక ఏపీలో బీజేపీ బతికి బట్ట కట్టాలంటే ఒకేఒక్క మార్గముందన్నారు. చంద్రబాబుతో జతకడితేనే బీజేపీకి లైఫ్ ఉంటుందన్నారు.

Advertisement