నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసి ఇంటికి వెళ్లిపోయేదాకా స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. ఈ విషయం అంటుంది మరెవరో కాదు. జేసీ దివాకర్ రెడ్డి. ఈయనకు ఉన్నంత క్లారిటీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడికి లేకపోవడం ఆశ్చర్యకరం. ఎన్నికలు జరగవు మొర్రో అంటూ జేసీ ఎప్పటి నుండో చెప్తున్నాడు. ఆవేశంగా మాట్లాడతాడు అన్న విషయం పక్కన పెడితే అయన ఆవేశంలోను ఒక లాజిక్ ఉంటుంది. ఈ విషయంలో బాబు కి వ్యతిరేఖంగా టీడీపీ వర్గాలు సైతం తమ కామెంట్స్ ని వినిపిస్తున్నాయి.
నిమ్మగడ్డ అలియాస్ చంద్ర బాబు వర్సెస్ వైస్ జగన్
కరోనా కారణం గా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని వైస్ జగన్ తన వాదన వినిపిస్తున్నాడు. కాని రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ మంత్రం అందుకు అంగీకరించరు. అయన పట్టింది మొండి పట్టుగా ఫిబ్రవరిలో ఎలెక్షన్స్ జరపాలని భావిస్తున్నాడు. కానీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం కష్టం అంటున్నారు.
ఒక వేల హైకోర్టు ఒకే చెప్పిన ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కి వెళ్తుంది. అక్కడ ఏమైనా తేడా వచ్చిన ఇంకా ఎవరైనా నేతలతో కోర్టులో వాజ్యం వేయించే అవకాశం ఉంది. అదే కాకుండా ఏపీలో ఎన్నికలపై ఇప్పటికే కొంత వ్యక్తిరేఖత వస్తుంది అంటున్నారు జేసీ దివాకర్ రెడ్డి. అందుకే పుంఖాను పంఖాలుగా స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలవుతాయని జేసీ వాదన. ఈ కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుందని, ఆ లోగ నిమ్మగదా పదవి కాలం పూర్తవుతుందని జోశ్యం చెప్తున్నారు జేసీ. అయినా కూడా చంద్ర బాబు తన అనుభవాన్ని రంగరించి స్థానిక సంస్థల ఎన్నికల కోసం పట్టు పడుతుండటం నిజంగా హాస్యాస్పదం. మరి ఈ మాత్రం క్లారిటీ బాబు కి ఎందుకు లేదు అంటూ తల పట్టుకుంటున్నారు సామాన్యులు. కాస్త మీదైనా చెప్పి పుణ్యం కట్టుకోండి జేసీ సారూ.