నదిలో పడిపోయిన జవాన్ల వాహనం

Advertisement

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలో పడిపోయింది. ఇక ఈ ఘటనలో ఇద్దరు సైనికులతో పాటు ఓ డ్రైవర్ గల్లంతు అయ్యారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో రైఫిల్ ‌మ్యాన్ నీమా దొంధూప్ ఉన్నారు. అయితే ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇక తమ విధుల్లో భాగంగా వాహనంలో వెళ్తుండగా కిన్నౌర్ జిల్లాలోని స్పిలో వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలోకి దూసుకు పోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం భారీగా ఉంది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే గల్లంతైన జవాన్ల కోసం గాలిస్తున్నట్లు కిన్నౌర్ ఎస్పీ ఎస్.ఆర్. రానా వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here