Jaswanth: కాచిగూడలోని టీఎక్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న జ‌స్వంత్.. ఆరోగ్యం ఎలా ఉంది?

Jaswanth:బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో జ‌స్వంత్ ఒక‌రు. అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. కాజ‌ల్ ఎలిమినేట్ కావ‌ల‌సి ఉండ‌గా, హెల్త్ బాగోలేని కార‌ణంగా జ‌స్వంత్ ప‌దో వారం బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అయితే ప్ర‌స్తుతం అత‌ను కాచిగూడలోని టీఎక్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

TheNewsQube-
jaswanth health condition is stable
jaswanth health condition is stable

విజయవాడకు చెందిన జశ్వంత్‌ మోడల్‌గా, యాక్టర్‌గా రాణిస్తూ బిగ్‌బాస్‌ 8వ కంటెస్టెంట్‌గా చోటు సంపాదించాడు. బిగ్‌బాస్‌ షోలో గేమ్‌ ఆడుతుండగా మరో కంటెస్టెంట్‌ చేయి జశ్వంత్‌ మెడపై బలంగా తగిలి నొప్పి ఎక్కువ కావడంతో షో నుంచి వైదొలిగాడు. జశ్వంత్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ నుంచి వైదొలగడం బాధగా ఉందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తెలిపాడు.

జ‌శ్వంత్ ప‌డాల అలియాస్ జెస్సీ కొన్నిరోజులుగా వెర్టిగో అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాడు. స‌మ‌స్య పెద్ద‌ది కావ‌డంతో బిగ్‌బాస్ అత‌న్ని వైద్య పరీక్ష‌లు నిమిత్తం బ‌య‌ట‌కు పంపేసిన‌ట్లు టాక్‌. వెర్టిగో అంటే త‌ల తిరగ‌డం, చెమ‌ట‌లు ప‌ట్ట‌డం, వాంతులు కావ‌డం, వినికిడి లోపం, స‌రిగ్గా నిలుచోలేక‌పోవ‌డం వంటి లక్ష‌ణాలుంటాయి.

jaswanth health condition is stable2
jaswanth health condition is stable2

ఈ వెర్టిగో స‌మ‌స్య తీవ్ర‌త‌రం కావ‌డంతోనే బిగ్‌బాస్ జెస్సీని బ‌య‌ట‌కు పంపేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌ర్టిగో’ వ్యాధి వల్ల జెస్సీ గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు.. తినలేకపోతున్నాడు.. సరిగా నడవలేకపోతున్నాడు.. మెడ పట్టుకుని చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు

బిగ్‌బాస్ నుంచి ఇలా కంటెస్టెంట్స్ బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం అనేది చాలా సార్లు జ‌రిగింది. గతంలో సంపూర్ణేష్ బాబు, త‌ర్వాత గంగ‌వ్వ‌, నోయ‌ల్ ఇలా గేమ్ మ‌ధ్య నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వారే. మ‌రి ఈసారి జెస్సీ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసాడు.