రాజీనామా చేసిన జపాన్ ప్రధాని

Advertisement

జపాన్ ప్రధాన మంత్రి షింజో అబె తన పదవికి రాజీనామా ప్రకటించాడు. అయితే కొంతకాలంగా ఆయన పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అందుకోసమే ‘ప్రధాని పదవి నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ఆత్మవిశ్వాసంతో ప్రజలను పాలించే స్థితిలో లేనని పేర్కొన్నాడు. ఒకవైపు కరోనా వైరస్‌ క్లిష్టకాలంలో పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే, సంవత్సర పదవి కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేస్తున్నందుకు దేశ ప్రజలకు క్షమాపణలు కోరుతున్నాను వంగి నమస్కారం పెట్టాడు. ఇక జపాన్ దేశ‌ చరిత్రలో అత్యంత ఎక్కువకాలం పనిచేసిన ప్రధానిగా అబె నిలిచిపోయాడు. ఇక ఆయన రాజీనామాతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌ దేశ తరువాతి ప్రధాని ఎవరని ప్రపంచం మొత్తం కూడా వేచిచుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here