భారత్ కు జపాన్ 3 వేల కోట్ల సాయం

Advertisement

కరోనా దెబ్బకు చిన్న నుండి పెద్ద దేశాల వరకు అన్ని కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఇక భారత్ విషయానికి వచ్చిన అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. అయితే ఇప్పుడు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు భారత్ కు 3500 కోట్ల రూపాయల ఋణాన్ని ఇస్తున్నట్లు జపాన్ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ విషయం భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సిఎస్ మొహాపాత్ర, భారత్ లోని జపాన్ రాయబారి సుజుకి సతోషిలు పత్రాలను మార్చుకున్నారు.

ఇక నిధులతో కరోనాతో బాధపడుతున్న ఎంతో మంది భాదితులకు మేలు కానుంది. ఒకవైపు ఇప్పటికే చాలా దేశాలు సైతం కరోనా దాటికి అతలాకుతలం అవుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కరోనాను తరిమి కొట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు కరోనా మరింత పెరుగుతుంది. ఇక భారత్ ఈ ఋణం తో వైద్యనికి సంబందించిన పరికరాలు కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here