NTR 30 Movie : యంగ్ టైగర్ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ కపూర్? మరీ అంత భారీ పారితోషికమా?

NQ Staff - December 20, 2022 / 06:03 PM IST

NTR 30 Movie : యంగ్ టైగర్ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ కపూర్? మరీ అంత భారీ పారితోషికమా?

NTR 30 Movie : బోణీ కపూర్, శ్రీదేవిల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో బోణీ కొట్టేందుకు రెడీ అయిందట. ఈ మాట చాలా రోజుల్నుంచీ వింటూనే ఉన్నాంలెండి అని లైట్ తీస్కోకండి. ఈసారి రెమ్యునరేషన్ తో సహా అమ్మడి ప్రాజెక్ట్ అప్ డేట్స్ సోషల్మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించనున్న లేటెస్ట్ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్సయిపోయిందట. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ కానుందట. టాలీవుడ్లో ఈ మూవీతోనే ఎంట్రీ ఇస్తున్నా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లే అని ఫిక్సైందట జాన్వీ. దాంతో ఈ అప్ కమింగ్ మూవీ కోసం ఏకంగా రూ. 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందట.

నిజానికి జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోందంటూ చాలా రోజుల్నుంచీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తను బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం, టాలీవుడ్ లోకి డెబ్యూ ప్రాజెక్ట్ చేయడానికి సరిపడ కథ దొరక్కపోవడం వల్ల తెలుగు సినిమా చేయడం కుదరలేదు. మరోవైపు శ్రీదేవి, బోణీకపూర్ కూతురన్న బ్రాండ్, బ్యాక్ గ్రౌండ్ ఉన్నా హిందీలో పెద్దగా చెప్పుకోదగ్గ హిట్లయితే దక్కట్లేదు. సిల్వర్ స్క్రీన్ తో పాటు, ఓటీటీ ప్రాజెక్టులు చేసినా కూడా సక్సెస్ నివ్వడం లేదు.

దాంతో తన తల్లి శ్రీదేవికి పేరు తెచ్చిపెట్టిన తెలుగు ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టి కెరీర్ ను ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలనుకుంటోందట జాన్వీ. పైగా తారక్, కొరటాల మూవీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ మళయాళ భాషల్లో రిలీజ్ కానుండడంతో సినిమా సక్సెసయితే అన్ని భాషల్లోనూ తన స్టార్ డమ్ ని పెంచుకోవచ్చన్న ఆశతో ఉంది. అంతా బానే ఉంది గానీ.. మరీ రూ. 4 కోట్ల రెమ్యునరేషనా? అంటే.. సోషల్మీడియాలో ఈ హాట్ బ్యూటీకున్న క్రేజ్ అలాంటిది.

మరీ పర్ ఫామెన్స్ ఇరగదీసే పాత్రలతో పెద్దగా మెప్పించకపోయినా గ్లామర్ తో మాత్రం మంచి ఫాలోయింగునే సంపాదించుకుంది. మాస్ కమర్షియల్ మూవీ కాబట్టి తన క్రేజ్ అండ్ పాపులారిటీ ఈ ప్రాజెక్టుకు కలిసొస్తుందనేది మేకర్స్ ప్లాన్.

Janhvi Kapoor Will Entry Tollywood With NTR 30 Movie

Janhvi Kapoor Will Entry Tollywood With NTR 30 Movie

మరోవైపు ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఉన్నాడు కొరటాల శివ. జనతా గ్యారేజ్ మూవీ తర్వాత మళ్లీ తారక్ తో తన కాంబో రిపీట్ కానుండడంతో అభిమానుల్లోనూ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ హైప్ ను అందుకునేలా, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో రికార్డుల ఊచకోతకు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల.

మరోవైపు త్రిబులార్ తర్వాత తారక్ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ రెట్టింపయిన విషయం తెలిసిందే. జక్కన్నతో సినిమా చేసి హిట్ కొట్టాక ఆ హీరో తర్వాతి మూవీ పక్క ఫ్లాపువుతందనే సెంటిమెంట్ నుంచి చరణ్ తో సహా ఇప్పటివరకూ ఏ యాక్టర్ కూడా తప్పించుకోలేదు. దాంతో కొరటాలకి, ఎన్టీఆర్ కే కాదు.. నందమూరి హార్డ్ కోర్ అభిమానులకు కూడా ఈ ప్రాజెక్ట్ మరింత ప్రెస్టేజియస్ గా మారింది.

మరిన్ని ఈక్వేషన్స్ మధ్య జాన్వీ కపూర్ టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఎలాంటి రిజల్ట్ నిస్తుంది? తల్లి శ్రీదేవికి కెరీర్ నిచ్చిన తెలుగు ఇండస్ట్రీ జాన్వీకెంత వరకు కలిసొస్తుంది? ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ హాట్ బ్యూటీకి ఏ రేంజ్ హిట్ ఇస్తుందో? కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి మరి?

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us