Vaarahi : జనసేనాని ‘వారాహి’ యాత్రకు ముహూర్తం ఫిక్స్

NQ Staff - June 2, 2023 / 09:21 PM IST

Vaarahi : జనసేనాని ‘వారాహి’ యాత్రకు ముహూర్తం ఫిక్స్

Vaarahi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వారాహి వాహనం రెడీ అయ్యి చాలా నెలలు అయ్యింది. ఇన్నాళ్లుగా యాత్ర మొదలు పెట్టక పోవడం పట్ల జనసేనాని కార్యకర్తలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు జనసేనాని పవన్ కళ్యాణ్‌ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు అయ్యింది. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మీడియా సమావేశంలో పవన్ పర్యటనపై ప్రకటన చేశారు.

నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ… వారాహి వాహనం ద్వారా యాత్ర చేపట్టబోతున్నామని ఆయన వెళ్లడించారు. ఈనెల 14 నుండి పవన్ వారాహి వాహనం రోడ్డు ఎక్కబోతున్నట్లుగా తెలియజేశారు. జనసేన పార్టీ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను జనసేన పార్టీ నాయకులు విడుదల చేయడం జరిగింది.

తొలి విడతగా తూర్పు గోదావరి జిల్లా నియోజక వర్గాల్లో వారాహి యాత్ర ఉంటుంది. అన్నవరం క్షేత్రంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి యాత్ర ప్రారంభం అవ్వబోతున్నట్లుగా పేర్కొన్నారు. అన్నవరం నుండి భీమవరం వరకు సాగుతుందని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.

ప్రత్తిపాడు.. పిఠాపురం.. కాకినాడ రూరల్‌.. ముమ్మిడివరం.. రాజోలు.. పి గన్నవరం.. నరసాపురం నిజయోజక వర్గాల్లో పవన్‌ తొలివిడత యాత్ర కొనసాగబోతున్నట్లుగా జనసేన పార్టీ నాయకులు అధికారికంగా ప్రకటించారు. యాత్రలో భాగంగా వివిధ వర్గాల్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతూ పవన్ యాత్ర కొనసాగబోతుంది అంటూ నాదెండ్ల పేర్కొన్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us