Pawan Kalyan : మొత్తానికి రెమ్యునరేషన్ ఎంతో చెప్పేసిన పవన్.. రోజుకు ఎన్ని కోట్లంటే..?
NQ Staff - March 15, 2023 / 09:51 AM IST

Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలం అవుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ పదో వార్షికోత్సవ సభను కృష్ణా జిల్లాలోని మచిలీ పట్నంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ అనేక విషయాలపై మాట్లాడారు. చాలా మంది నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఈ మధ్య అయితే మరో కొత్త రూమర్ సృష్టించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నాకు రూ.1000 కోట్లు ఆఫర్ చేశారంట. వినడానికి నవ్వేస్తోంది. నాకు వెయ్యి కోట్లు ఏం అవసరం. పవన్ కల్యాణ్ కు వెయ్యి ఏం ఖర్మ.. పది వేల కోట్లు అనాల్సింది. అయినా నాకు డబ్బులు ఏం అవసరం. నేను డబ్బులు పెట్టి మిమ్మల్ని కొనగలనా. అదంతా మూర్ఖులు చేసే కామెంట్లు.
20 రోజులు చేస్తున్నా..
డబ్బులతో మీ హృదయంలో స్థానం సంపాదించగలనా నేను. నా మీద ప్యాకేజీ ముద్ర వేయాలని అనుకునే వారికి నేను చెప్పు చూపించాను. నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు. నాకు డబ్బు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తున్నాను వినండి. నేను సినిమాకు 20 రోజులు పని చేస్తున్నా.
రోజుకు రూ.2కోట్లు తీసుకుంటున్నా. అంటే సినిమాకు రూ.40కోట్లు తీసుకుంటున్నా. అది నా యావరేజ్ స్థాయి. ఈ స్థాయి కూడా మీరు ఇచ్చిందే. అలాంటప్పుడు నాకు డబ్బులు ఏం అవసరం అంటూ సీరియస్ కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్. ఆయన చేసిన కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.