Pawan Kalyan : మూడు మార్గాలు: తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇచ్చిన జనసేనాని.!
NQ Staff - June 4, 2022 / 11:03 PM IST

Pawan Kalyan : జనసేన పార్టీ ముందు మూడు మార్గాలు వున్నాయంటూ జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిల్లో ఒకటి జనసేన ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం అయితే, ఇంకోటి ప్రస్తుతం మిత్రపక్షంగా వున్న బీజేపీతో కలిసి వెళ్ళడం. మూడోది అత్యంత కీలకమైనది.. అదే తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం.

Janasena Pawan Kalyan about Political alliance
వీటిల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అని స్వయంగా జనసేనాని, కొన్నాళ్ళ క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో స్పష్టం చేసేశారు. బీజేపీతో పొత్తు విషయమై జనసేనకు కొంత గందరగోళం వుంది. జనసేనాని రోడ్ మ్యాప్ అడుగుతున్నారు.. ఆల్రెడీ ఇచ్చేశామని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. సో, ఈ పంచాయితీ తెగేలా కనిపించడంలేదు.. ఇద్దరూ కలిసి ముందడుగు వేసేలా కూడా కనిపించడంలేదు.
ఇక, ముచ్చటగా మూడోదైన టీడీపీతో జనసేన పొత్తు అనేది అత్యంత కీలకమైన వ్యవహారమే. కానీ, ‘గతంలో మీకు మేం మద్దతిచ్చాం. ఈసారి మీరు తగ్గండి..’ అంటూ టీడీపీకి తేల్చి చెప్పారు జనసేనాని. అంటే, తెలుగుదేశం పార్టీ అధికారం మీద ఆశలు వదిలేసుకుని, జనసేన పార్టీకి మద్దతివ్వాలన్నమాట. టీడీపీ సాయంతో జనసేన పార్టీ గద్దెనెక్కుతుందన్నమాట.
నిజానికి, చాలా ధైర్యంతోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాలి. ఎందుకంటే, వైసీపీ ఎలాగూ జనసేనను టార్గెట్ చేసేసింది. ఇప్పుడిక తెలుగుదేశం పార్టీ నైజం కూడా బయటపడిపోతుంది. జనసేనానిపై విపరీతంగా ట్రోలింగ్ చేస్తారు. జనసేన స్థాయిని తగ్గించేందుకు టీడీపీ అనుకూల మీడియానీ ఉపయోగిస్తారు.
ఏం జరిగినాసరే, జనసేనాని మాత్రం తగ్గేదే లే.. అంటున్నారు. మరి, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయం ఎలాంటి మలుపులు తిరగబోతోంది.? వేచి చూడాల్సిందే.