Janasena: ఎన్నికల గుర్తే లేనప్పుడు.. ఏం చేస్తుంది?..

Janasena తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలు మరోసారి పొత్తుపెట్టుకున్నాయి. ఈ నెలాఖరులో జరిగే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇరు పార్టీల లీడర్లు మొన్న చర్చలు జరిపారు. ప్రస్తుతానికి ఖమ్మంలో కలిసి నడవాలనే దానిపై క్లారిటీ వచ్చిందంట. సీట్ల పంపకంతోపాటు ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడ బరిలో నిలవాలనే అంశాల్ని మరోసారి భేటీలో తేల్చనున్నారు. వరంగల్ తోపాటు మిగతా ఐదు మున్సిపాలిటీల్లో ఈ రెండు పార్టీలు ఏవిధంగా వ్యవహరిస్తాయనేది ప్రస్తుతానికి తెలియదు. కాగా ఈ సమావేశంలో జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి, వర్కింగ్ సెక్రెటరీ వి.వి.రామారావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, కిసాన్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఆ షాక్ తోనే..

జనసేన పార్టీ తన కామన్ పోలింగ్ సింబల్ గాజు గ్లాసును ఇక పై ఏ ఎన్నికల్లోనూ వాడుకోటానికి లేదు. ఎందుకంటే ఆ గుర్తును తమకే కేటాయించాలన్న రిక్వెస్టుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. మరో ఐదేళ్ల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. అంటే ఏదైనా ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీచేస్తే ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తుకి బదులు మరేదైనా సింబల్ ని ఇస్తుంది. అసలే తెలంగాణ రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న జనసేనకి గాజు గ్లాసు గుర్తు లేకపోవటం మరో పెద్ద మైనస్ పాయింట్. వేరే గుర్తుతో పోటీ చేసినా చేయకున్నా వచ్చే ఫలితం ఒకటే. ఎందుకంటే పేరుకు జనసేన పార్టీ అయినా తన పోలింగ్ సింబల్ ని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి ఇండిపెండెంట్ అభ్యర్థి మాదిరిగా తీవ్రంగా కష్టపడాలి. అంత చేసినా గెలుస్తామా అంటే అదీ లేదు. అందుకని ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ పొత్తు పెట్టుకోవటం బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ పండితులు చెబుతున్నారు.a

Advertisement