జనసేనాని కొత్త నినాదం. అది ఏంటో తెలుసా..!

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నినాదాన్ని తెర పైకి తీసుకొచ్చాడు. అయితే ఆ నినాదాన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలి అని వెల్లడించాడు. ఇక ఈ వినాయక చవితి నుండే దీన్ని ప్రారంభించాలి అని తెలిపాడు. ప్రజలు అందరు కూడా స్వదేశీ ఉత్పత్తులు మాత్రమే వాడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ మేరకు పిలుపునిచ్చారు. వినాయక చవితి నుండి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఏ వస్తువు కొన్న అది ఎక్కడ తయారు అయ్యిందో చూసి, స్వదేశానిదే కొనుగోలు చేయాలనీ అన్నాడు.

అయితే మన దేశ వస్తువులకు మంచి గిరాకీ రావాలనే ఈ నినాదాన్ని చేపట్టామని స్పష్టం చేసాడు. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ అనే నినాదం దేశ ప్రజలందరి అభివృద్ధికి సంబంధించినదని అన్నారు. ముఖ్యంగా మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి అనే పదామే ఆత్మ నిర్భర భారత్ అని వర్ణించాడు. అందుకే ఈ వినాయక చవితి పండుగ నుండే ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని భారతీయ జనతా పార్టీ తో కలసి జనసేన అడుగులు వేస్తుందని వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here