జనసేన గాలికి వచ్చిన పార్టీ: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

Admin - August 12, 2020 / 08:49 AM IST

జనసేన గాలికి వచ్చిన పార్టీ: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

రాజోలు: జనసేన పార్టీ నిలబడే పార్టీ కాదని, ఎదో గాలికి వచ్చిన పార్టని, తాను వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తనకు 2019 ఎన్నికల్లో వైసీపీ నుండే టిక్కెట్ వచ్చేదని, అయితే చివరి నిమిషంలో రాలేదని వెల్లడించారు. ఖాళీగా ఉన్న తనను జనసేన ఆహ్వానించడంతో ఆ పార్టీ నుండి పోటీ చేశానని తెలిపారు.

జనసేన పార్టీపై తనకు నమ్మకం లేదని, వైకాపా నేతగానే ఉన్నానని వెల్లడించారు. అలాగే రాజోలు నియోజయక వర్గంలో వైసీపీ చెందిన మూడు గ్రూప్స్ ఉన్నాయని, జగన్ ఈ విషయంపై స్పందించి ఎవరికో ఒకరికి వైసీపీ భాధ్యతలు అప్పగించాలని వీడియోలో తెలిపారు. ఈ వీడియోపై జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us