Nadendla Manohar : అధికార పార్టీపై నాదెండ్ల మనోహర్ ఫైర్?

Nadendla Manohar : జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాజాగా సీరియస్ అయ్యారు. పరిషత్ ఎన్నికల్లో ప్రభుత్వం జనసేన నేతలను చాలా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆయన విమర్శించారు. జనసేన నేతలపై దాడులకు పాల్పడుతున్నారని… అధికార పార్టీ నేతలు తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన నేతలపై ఇలా దాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి పోటీగా నిలబడినందుకు… జనసేన నాయకుల మీద, జనసేన మహిళా కార్యకర్తల మీద అధికార పార్టీ వాళ్లు దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం హేయనీయం… అంటూ నాదెండ్ల మండిపడ్డారు.

janasena leader nadendla manohar fires on ys jagan
janasena leader nadendla manohar fires on ys jagan

ఎన్నికల్లో నిలబడటం అనేది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో నిలబడే హక్కు కూడా లేదా? తమకు పోటీగా నిలబడకూడదు…. అన్న ధోరణితో అధికార పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రశ్నలా కనిపిస్తోంది.. అని ఆయన స్పష్టం చేశారు. జనసేన నాయకుల ఇంటికే వెళ్లి వాళ్ల ఇంటి మీద దాడి చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్. ఇటువంటి ఘటనలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.. అని మనోహర్ తెలిపారు.

ఎన్నికల ఏజెంట్లుగా వ్యవహరించిన జనసేన నేతలను వదలరు. పోటీ చేసిన అభ్యర్థులను వదలరు…. చివరకు నాయకులు, కార్యకర్తలపై కూడా అధికార పార్టీ నేతలు దాడి చేయడం.. బెదిరించడం అనేది వాళ్ల అధికార అహంకారాన్ని నిదర్శనం. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిపై పోలీసులు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. పరిషత్ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ కూడా హడావుడిగా… ఎటువంటి ప్లానింగ్ లేకుండా నిర్వహిస్తోంది.. అంటూ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Advertisement