Janasena doing comedy : కామెడీ చేస్తున్న జనసేన.. అయోమయంలో పవన్ కల్యాణ్..!
NQ Staff - September 8, 2023 / 11:31 AM IST

Janasena doing comedy : అసలు ఏపీలో జనసేన ఎక్కడుంది. అసలు దాన్ని రాజకీయ పార్టీగా ఎవరైనా గుర్తిస్తున్నారా అంటే సమాధానమే లేదు. ఎందుకంటే ఆ పార్టీ తరఫున అసలు ఎమ్మెల్యేలు ఒక్కరైనా ఉన్నారా అంటే అదీ లేదు. గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీని వీడారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న కామెడీ అంతా ఇంతా కాదు. 151 సీట్లు గెలిచి ఏపీ చరిత్రలోనే భారీ మెజార్టీతో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వానికి కూడా ఆయన సవాళ్లు విసురుతున్నారు. ఏకంగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇదంతా చూసి నవ్వుకోవాలో ఇంకేం చేయాలో ఎవరికీ అర్థం కావట్లేదు.
అలాంటిది ఇప్పుడు మరో కామెడీ ప్రోగ్రామ్ ను పెట్టేశారు. ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రీసెంట్ గా ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏపీలో కొత్తగా 4 లక్షల మంది ఓటు హక్కు తీసుకున్నారని.. వారంతా బంగారు భవిష్యత్ కోసం జనసేనకు ఓటు వేస్తారని చెబుతున్నారు. అంతే కాకుండా నా మొదటి ఓటు జనసేనకే అనే వాల్ పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఇది భలే కామెడీగా ఉందని అంతా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి ఓటు జనసేనకు వేయాలంటే 175 చోట్ల జనసేన పోటీ చేయాలి కదా. అసలు అన్ని చోట్ల పోటీ చేసే కెపాసిటీ జనసేనకు ఉందా లేదని వారే చెబుతున్నారు.
అసలు ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందో పవన్ కల్యాణ్ కు కూడా తెలియక అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ఆయన టీడీపీతో పొత్తుల కోసం జపం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆయన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. చంద్రబాబు పర్యటనలో ఏకంగా టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేక చంద్రబాబు మాట కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు దయతలచి ఎన్ని సీట్లు ఇస్తే అన్నింటిలో పోటీ చేయడం తప్ప జనసేనకు మార్గం లేదు. మరి పోటీ చేయడానికే అభ్యర్థులు లేనప్పుడు అసలు ఈ క్యాంపెయిన్ లు ఎందుకో ఎవరికీ అర్థం కావట్లేదు.
ఇదంతా చూస్తుంటే జనసేన పెద్ద కామెడీ చేస్తుందని అంటున్నారు. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడే కొత్తగా ఓటు వేసే వారి ఓట్లు తమ పార్టీకి వేయాలని చెబితే ఓ అర్థం ఉంటుంది. మరి అన్ని స్థానాల్లో పోటీ చేయలేనప్పుడు అసలు తొలి తమ పార్టీకే వేయాలని ఎలా అంటారు. ఇలా కాకుండా కనీసం అన్ని చోట్ల పోటీ చేస్తామని చెబితే కార్యకర్తల్లో ధైర్యం నింపిన వారు అవుతారు. అలా కాదని ఇలాంటి తలా తోక లేని ప్రకటనలు చేయడం ఏంటని అంతా కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికైనా ఇలాంటి కామెడీ ప్రకటనలు చేయడం మానేసి తమ రాజకీయ విధానాలపై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తేనే జనసేన బలం పుంజుకుంటుంది. లేదంటే అంతే సంగతి అంటూ చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు పవన్ చేస్తున్న తలా తోక లేని పనుల వల్ల అమాయక కార్యకర్తలు మాత్రమే మోసపోతున్నారు. కానీ పవన్ మాత్రం ఎంచక్కా నాలుగు సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించేస్తున్నారు.