మహిళల రక్షణకు చట్టాలు బలోపేతం చెయ్యాలి: పవన్ కళ్యాణ్
Admin - August 5, 2020 / 06:56 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవని, వారి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఒక ఎస్సీ మహిళను కొందరు దుండగులు ట్రాక్టర్లుతో తొక్కించి చంపడం దారుణమన్నారు. అలాగే కర్నూల్ జిల్లా వెలుగోడులో జరిగిన అత్యాచారం కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందిస్తూ … రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 400 వందల అత్యాచార ఘటనలు జరిగాయని, వీటి పై జగన్ ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా చట్టం, ఈ-రక్షాబంధన్ అంటూ జగన్ గొప్పలు చెప్తున్నారు కానీ వాటిలో ఆచరణలో పెట్టడం లేదని వెల్లడించారు.