జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..!

Advertisement

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజుల్లో సినీ హీరోలు అయినా ,రాజకీయ నాయకులు అయినా ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇది ఇలా ఉంటె ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా చాపా కింద నీరులా విస్తరిస్తుంది.

ఈ కరోనా దెబ్బకు పేద , మధ్య తరగతి ప్రజల పరిస్థితి దారుణంగా తయారయింది. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారు. అయితే ప్రజా సంక్షేమాన్ని మరియు లక్షలాది మంది చిరు వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయి సంతోషంగా ఉండాలని పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టరు. ఈ దీక్షాపేరే “చాతుర్మాస్య దీక్ష”. అయితే ఈ దీక్ష ఏకంగా నాలుగు నెలలపాటు చేయనున్నారు పవన్. అయితే ఈ బుధవారం తోలి ఏకాదశి నాడు మొదలు పెట్టాడు. ఈ తోలి ఏకాదశి ని శయనై ఏకాదశి గా కూడా పిలుస్తారు.

ఈ శుభా సందర్బంగా ఈ చాతుర్మాస్య దీక్షను చేపట్టాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ దీక్షను ఆషాడ శుక్ల నాడు మొదలుపెట్టి… కార్తీక శుక్ల నాడు విరమిస్తాడు. అంతేకాదు ఈ చాతుర్మాస్య దీక్షను విరమించేటపుడు ఒక పెద్ద హోమం నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఈ దీక్ష ఆషాడం, శ్రావణం, భద్రపదం, ఆశ్వియుజ మాసాల్లో కొనసాగనుంది. ఈ దీక్షను చివరగా కార్తీక శుక్లా నాడు విరమిస్తారు పవన్కళ్యాణ్. అయితే ఈ చాతుర్మాస్య దీక్షలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ మాంసహారాన్ని అస్సలు ముట్టుకోరు.

కేవలం పండ్లు ఫలాలు ఎక్కువ గా తీసుకోనున్నారు. అలాగే అతిగా ఆహారం కూడా తీసుకోరు. కొంత మొత్తం లో మాత్రమే ఆహారాన్ని తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అది కూడా రోజుకు ఒకే ఒక్క పూట తీసుకుంటారు పవన్. నిజంగా ప్రజల సంక్షేమాం దృష్ట్యా ఈ దీక్ష చేపట్టడం గొప్ప విషయం అని అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here