Pawan Kalyan : చేతిలో హనుమంతుడి గదతో పవన్ కల్యాణ్.. పిక్ వైరల్..!
NQ Staff - January 25, 2023 / 01:07 PM IST

Pawan Kalyan : పవన్ కల్యాణ్ మొదటి నుంచి ఆంజనేయ స్వామి భక్తుడిగానే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన ముందుగా హనుమంతుడిని పూజిస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఎంతో ఇష్టపడి చేయించిన వారాహి వాహనానికి కూడా కొండగట్టులోనే పూజ జరిపించాడు. ఆయన రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు.
కొండగట్టులో పూజలు..
ఇందులో భాగంగానే వారాహిని కూడా రెడీ చేయించాడు. త్వరలోనే వారాహి యాత్రను షురూ చేయబోతున్నాడు. అందుకే నిన్న కొండగట్టులోని ఆంజనేయ స్వామి వద్ద వారాహి బండికి పూజ కూడా జరిపించాడు. ఇక అయితే పూజ తర్వాత ఆయన తెలంగాణ ముఖ్య నేతలతో మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు.
ఈ క్రమంలోనే ఆయన హనుమంతుడి గదతో దిగిన ఫొటో ఒక్కటి వైరల్ అవుతోంది. కొండగట్టు సన్నిధానంలోనే ఆయన ఫ్యాన్స్ బహూకరించిన ఈ గదతో వారాహి మీద నిలబడటం చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నాడు. రంగానికి సిద్ధమైన హనుమంతుడిలా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ పిక్ మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.