అమరావతి పై ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలని ఏబీఎన్, నెటిజన్స్ ఫైర్

Advertisement

ఏపీ లో జగన్ సర్కార్ అనుకున్నట్లు మొత్తానికి ఏపీ లో మూడు రాజధానులకు ఆమోదం వచ్చింది. దీనితో ప్రతిపక్షాలు మరియు అమరావతి రైతులు చేసిన పోరాటం అంత కూడా వృధా అయిపొయింది. అయితే సర్కార్ తీసుకున్న నిర్ణయంలో వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చేశారు. దీనిపై రాష్ట్రంలో మిశ్రమ స్పందన వస్తోంది. వైజాగ్ , కర్నూలు తదితర ప్రాంతాల ప్రజలు వికేంద్రీకరణ మంచిదేనని అభిప్రాయపడుతుంటే కానీ అమరావతి రైతులు, టిడిపి అనుకులంగా ఉన్న వారు జగన్ సర్కార్ నిర్ణయం పై మండి పడుతున్నారు. ఇలా టీడీపీ వైసీపీ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే ఏబీఎన్ ఛానల్ మాత్రం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తుంది.

రాజధాని విషయం లో పవన్ కళ్యాణ్ ఎందుకు నోరుతెరవడం లేదని డెబిట్ లు పెట్టి పవన్ పై విమర్శలు చేస్తుంది. ఒకవైపు జనసేన సైనికులు స్పందిస్తూ.. అమరావతి రాజధాని పెట్టింది చంద్రబాబు మరియు విభజన చేసింది జగన్ సర్కార్ మధ్యలో జనసేన ను ఎందుకు లాగుతున్నారు అని ఏబిన్ పై జనసేన సైనికులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏ సమస్యా లేనప్పుడు అసలు జనసేన పార్టీ లేదని, ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైందని అంటూ ఒక రేంజ్ లో కథనాలు వేసే ఏబీఎన్, సమస్య వచ్చినప్పుడు మాత్రం అటు చంద్రబాబు ని, జగన్ ని ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించాలి అంటూ కథనాలు చేయడం ఏంటని నెటిజన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here