Jana reddy: రాజకీయాలకు ఇక ‘‘జానా’’ నహీ..

Jana reddy: నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ చేతిలో మరోసారి ఓడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. తన కుమారుణ్ని రాజకీయ వారసుడిగా బరిలోకి దింపాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హస్తం పార్టీ ఇన్నాళ్లూ తనకు ఇచ్చిన గౌరవం కోసం లేటెస్ట్ బైఎలక్షన్ లో పాల్గొన్నానని స్పస్టం చేశారు. ధర్మంతో, ప్రజాస్వామ్య విలువలతో ఎలక్షన్ లో పాల్గొన్నానని అన్నారు.

భగత్ కి కంగ్రాట్స్..

తాజా ఎన్నికలో తనపై విజయం సాధించిన నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కుమార్ కి జానారెడ్డి అభినందనలు తెలియజేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఇవాళ రాత్రి హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విక్టరీ కోసం పాటుపడ్డ ప్రతిఒక్క కార్యకర్తకి, నాయకుడికి, తనకు ఓటేసిన ప్రజలకు జానారెడ్డి ధన్యవాదాలు చెప్పారు. కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచి ప్రస్తుత సర్కార్ ను పడగొట్టాలనో, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనో అత్యాశతో ఈ ఎలక్షన్ లో పోటీ చేయలేదని, ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకే బరిలోకి దిగానని జానారెడ్డి అన్నారు.

సత్తా చాటాం..

‘‘టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మంత్రులు అంతా కలిసి హస్తం పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నించారు. అయినా అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డాం. సత్తా చాటాం. అధికార పార్టీకి 47 శాతం ఓట్లు వస్తే మాకు 37 శాతం వచ్చాయి. తేడా కేవలం 10 శాతమే. కేసీఆర్ గవర్నమెంట్, పార్టీ రెండూ కలిసి సర్వశక్తులు ఒడ్డినా స్వల్ప మెజారిటీతోనే గెలిచారనే సంగతిని రాష్ట్ర ప్రజలు గమనించాలి. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందేమీ లేదని క్లియర్ కట్ గా కనిపిస్తోంది. దీన్నే ఎంకరేజ్మెంట్ గా భావిస్తూ రానున్న ఎన్నికల్లో హస్తం పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి’’ అని జానారెడ్డి సూచించారు.

Advertisement