James Anderson: ఓ వైపు ర‌క్తం కారుతున్నా, అంకిత భావంతో బౌలింగ్ చేసిన స్టార్ బౌల‌ర్

James Anderson: ఓ దేశం త‌ర‌పున ఆడే అర్హ‌త ద‌క్క‌డం చాలా అదృష్టం.మ‌న దేశ ప్ర‌తిష్ట‌ను పెంచే అవ‌కాశం కొందరికే ద‌క్కుతుంది.ఆ అవ‌కాశాన్ని ప్ర‌తి ఒక్క‌రు స‌ద్వినియోగ ప‌ర‌చుకోవాలి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ ఆట పట్ల తనకున్న అంకిత భావాన్ని మరోసారి ప్రదర్శించాడు. మోకాళ్ల నుండి ర‌క్తం కారుతున్న‌ప్ప‌టికీ అంకిత భావంతో బౌలింగ్ చేసి శ‌భాష్ అనిపించుకున్నాడు.


James Anderson continues to bowl despite bleeding at The Oval
James Anderson continues to bowl despite bleeding at The Oval


సెప్టెంబ‌ర్ 2న భార‌త్ – ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మొద‌లు కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి భార‌త్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్‌ 42 ఓవర్ బౌల్‌ చేస్తున్న జిమ్మీ.. మోకాళ్లకు ర‌క్త‌పు మ‌ర‌క‌లు క‌నిపించాయి. ఆ స‌మ‌యంలో అండ‌ర్స‌న్ వెంట‌నే మైదానం వీడ‌కుండా త‌న కోటా ఓవ‌ర్ పూర్తి చేశాడు. ఈ స‌న్నివేశాలు టీవీల‌లో రికార్డ్ అయ్యాయి. అండ‌ర్స‌న్ ఆట ప‌ట్ల త‌న‌కున్న అంకిత భావాన్ని ప్ర‌ద‌ర్శించి అంద‌రిచే ప్ర‌శంస‌లు పొందుతున్నాడు.


అండ‌ర్స్‌కి గాయలు ఎప్పుడు తగిలాయన్నది టీవీల్లో కనబడలేదు. బహుళా ఫీల్డింగ్‌ చేసేటప్పుడు అతను ఈ గాయాల బారిన పడి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ టీంలో సీనియ‌ర్ బౌల‌ర్‌గాఉన్న అండ‌ర్స‌న్ ఇప్ప‌టికీ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. సిరీస్ త‌ర్వాత అండ‌ర్స‌న్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.


ఇక నాలుగో టెస్ట్‌లో భార‌త్ 191 పరుగులకు ఆలౌటైంది. కోహ్లి(50), శార్దూల్‌ ఠాకూర్‌(57) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ముఖ్యంగా శార్దూల్‌ ఠాకూర్‌ ఆఖర్లో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ 4, రాబిన్సన్‌ 3, ఆండర్సన్‌, ఓవర్టన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 54 ప‌రుగుల‌కు మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉంది.