Jagan’s changes in education sector : విద్యా రంగంలో జగన్ విప్లవాత్మక మార్పులు..!
NQ Staff - September 6, 2023 / 12:56 PM IST

Jagan’s changes in education sector : ఒక సమాజంలో మార్పులు రావాలంటే విద్యా రంగంలో మార్పులు రావాలి. విద్యా రంగం ఎంత పటిష్టంగా ఉంటే అంత మెరుగైన సమాజం ఏర్పడుతుంది. ఈ విషయం జగన్ కు బాగా తెలుసు. అందుకే ఆయన విద్యా రంగంపై విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. చంద్రబాబు హయాంలో కుంటుపడ్డ విద్యా వ్యవస్థను జగన్ దారిలోకి తీసుకువస్తున్నారు. ఏపీలో మెరుగైన యువత తయారు కావాలంటే స్కూల్ స్థాయి నుంచే పటిష్టమైన విద్యార్తులు తయారు కావాలన్నది జగన్ నిర్ణయం. అందుకే స్కూల్ స్థాయి నుంచే నాణ్యమైన విద్య, ఆహారాన్ని అందిస్తున్నారు. ఇందుకోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు.
జగనన్న అమ్మఒడి..
దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పిల్లల తల్లుల గురించి ఆలోచించలేదు. ఏ తల్లి కూడా పేదరికం కారణంగా తన పిల్లలను స్కూల్ కు పంపలేని స్థితిలో ఉండొద్దనే కారణంతో విద్యార్థుల తల్లులకు అమ్మవొడి పేరుతో ఏడాడికి రూ.15వేలు ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్లకు ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఈ నాలుగున్నరేళ్లలో రూ.29654 కోట్ల వరకు ఖర్చు పెట్టారు జగన్. దీని వల్ల స్కూళ్లలో గనణీయంగా స్టూడెంట్ల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
జగనన్న విద్యా దీవెన..
ఉన్నత చదువులు అయిన డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి చదవుల కోసం పేద విద్యార్థులకు విద్యాదీవెన పెట్టారు జగన్. ఈ పథకం వల్ల పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను మూడు నెలలకు ఓ సారి ఇచ్చేస్తున్నారు. ప్రతి త్రైమాసికానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు 36,72,624 మందికి రూ.16,694కోట్ల లబ్ధి చేకూరింది.
విద్యా కానుక..
ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి స్టూడెంట్లకు జగనన్న విద్యా కానుక కింద మూడు జతల యూనిఫామ్స్, నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్కులు, బ్యాగ్, బెల్ట్, షూస్, సాక్సులు కూడా అందిస్తున్నారు సీఎం జగన్. పేద విద్యార్థులు ఇవి కూడా కొనుక్కోలేని స్థితిలో ఉండొద్దనే గొప్ప ఉద్దేశంతో ఈ స్కీమ్ ను తీసుకువచ్చారు. ఈ నాలుగేండ్లలో దాదాపు కోటి మందికి పైగా విద్యార్థులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ది చేకూరింది.
వసతి దీవెన..
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి పై చదువులు చదివే స్టూడెంట్లు వసతి, భోజనం ఖర్చులకు ఇబ్బందులు పడొద్దనే కారణంతో జగన్ ఈ స్కీమ్ ను తీసుకువచ్చారు. దీని వల్ల ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఆపై చదువుల కోసం వెల్లే వారికి రూ.20వేల వరకు రెండు విడతల్లో ఇస్తున్నారు. దీని వల్ల ఇప్పటి వరకు 32లక్షల మంది విద్యార్థులకు పైగా లాభపడ్డారు. దీని కింద రూ.5,572 కోట్ల వరకు ఖర్చు పెట్టారు జగన్.
నాడు-నేడు
స్కూల్ బిల్డింగుల్లో కూడా వసతులు ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చారు జగన్. ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని 52వేల ప్రభుత్వ పాఠశాలలు, 500లకు పైగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల రూపు రేఖలు మార్చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఈ స్కూళ్లను తీర్చి దిద్దుతున్నారు. దీనితో పాటు గోరుముద్ద కార్యక్రమంలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఇలా అన్నింటిలో విద్యార్థుల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు సీఎం జగన్.