ఆదివారం అర్జెంట్ గా వేసిన హౌస్ మోషన్ పిటీషన్ వేసిన జగన్ కి సోమవారం తెల్లరుతూనే పెద్ద న్యూస్ వచ్చింది.

cm jagan ap
cm jagan ap

ఆంధ్రప్రదేశ్ లో సోమువారం పొద్దున్నే ఇంటింటి రేషన్ పంపిణీ వ్యాన్లు సైరన్ మోగిస్తూ రేషన్ సరుకులు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలనీ గతంలో వైసీపీ నేతలు భావించారు. సీఎం జగన్ మోహన్ చేతుల మీదగా విజయవాడ బెంజ్ సర్కిల్ లో పెద్ద ఎత్తున వాటి ప్రదర్శన కూడా ఇచ్చారు. ఈ ఫిబ్రవరి 1 నుండి మొదలుపెట్టాలని భావించారు. అయితే ఈ పధకం కొత్త పధకం కావటం, ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో, ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శసూత్రాలు విడుదల చేసింది. ముందుగా ఈ వాహనాలు అన్నిటి పై, పార్టీ రంగులు తొలగించాలని సూచించింది. రాజకీయ పార్టీ నేతలు, ఎమ్మెల్యే, మంత్రులు పాల్గునకుండా ఈ కార్యక్రమం సాగాలని చెప్పి సూచించింది.

nimmagadda vs jagan

అయితే రేపు ప్రారంభం కావలసి ఉన్న ఈ కార్యక్రమం పై, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనలతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయం హడావిడిగా హౌస్ మోషన్ పిటీషన్ మూవ్ చేసింది. ఈ రోజు ఉదయం హౌస్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిగింది. కొద్ది సేపటి క్రితం హైకోర్టు విచారణలో కొన్ని కీలకమైన సూచనలు చేసింది. రెండు రోజుల్లో దీనికి సంబంధించి, దీని పై ఒక కార్యాచరణ రెడీ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని ఆదేశించింది.

దీని పై ఎన్నికల సంఘం ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని, అంతిమ తీర్పు ఎన్నికల సంఘానిదే అంటూ జస్టిస్ బాగ్చి తెల్చి చెప్పారు. ఈ పధకాలు అన్నీ పేద ప్రజలకు సంబంధించినవి అని, దీనికి పెట్టె ఖర్చు అంతా ఏ ఒక్క రాజకీయ పార్టీది కాదని, ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఇస్తున్నవని, ఏ రాజకీయ పార్టీ కానీ ఇది ఓన్ చేసుకోకూడదు అని హైకోర్టు చెప్పింది.అలాగే దీంతో పటు రాజకీయ పార్టీ రంగులు కానీ, దీంతో పాటు రాజకీయ పార్టీ నేతల జోక్యం కానీ ఈ పధకం అమలులో ఉండకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చింది.

ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని కూడా తప్పు పట్టటానికి లేదని, ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉందని, ఇక పధకాల యొక్క ఆవశ్యకతను గుర్తించి, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా, అధికార యంత్రంగంతో మాత్రమే పంపిణీ చేసే విధంగా దృష్టి పెట్టాలని కోర్టు చెప్పుకొచ్చింది.

Advertisement