Jagan Vs Nimmagadda: ఇంకా అవలేదు – ఇప్పుడే మొదలైంది : జగన్ vs నిమ్మగడ్డ పోరులో సెకండ్ చాప్టర్ మొదలు ?

ap politics cm jagan vs sec nimmagadda ramesh
ap politics cm jagan vs sec nimmagadda ramesh

Jagan Vs Nimmagadda (జగన్ vs నిమ్మగడ్డ): స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో జగన్ మరియు నిమ్మగడ్డ ల మధ్య నెలకొన్న వైరానికి చెక్ పడిందని అందరూ భావిస్తున్నారు. కానీ వారిద్దరి మధ్య అసలైన పోరు ఇప్పుడే జరగబోతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత సంవత్సరం పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పక్షాల మద్ధతుతో నిలబడిన అభ్యర్థులను అధికార పార్టీ బెదిరించడంతో వారంతా కూడా ఏకగ్రీవాలకు ఒప్పుకున్నారు.

అయితే అప్పట్లో ఈ ఏకగ్రీవాల పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. చివరికి ఆ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు మళ్ళీ జరగబోతున్న అదే పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవాల ద్వారానే ముగించాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుని ఏకగ్రీవాలను ప్రోత్సహించే గ్రామాలకు రూ.5 నుంచి రూ.20 లక్షలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక జీవో విడుదల చేసింది. దీనితో నిమ్మగడ్డ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వైసీపీ సర్కార్ ఏకగ్రీవాలతో కచ్చితంగా గెలుస్తుందని.. అందుకే ఏ ఏకగ్రీవాలు జరగకుండా ఉండేలా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నారు.

అయితే ఏకగ్రీవాలు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం తప్పు కాదు కానీ బలవంతపు ఏకగ్రీవాలు మాత్రం రాజ్యాంగం ప్రకారం తప్పే. సో, నిమ్మగడ్డ బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెబుతూ సర్వాధికారాలను ప్రస్తుత ప్రత్యేక అధికారి అయిన ఎన్. సంజయ్ కి కట్టబెట్టారు. మరి సంజయ్ బలవంతపు ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేయ గలరా? అనేది అసలైన ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఏకగ్రీవాలను బలవంతపు ఏకగ్రీవాలు గా మార్చి అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ ఉండేలా చేయబోతున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క బలవంతపు ఏకగ్రీవం కూడా జరగదని.. బలవంతపు ఏకగ్రీవాలు ఆపడానికే నిమ్మగడ్డ ఇన్నిరోజులు పట్టుబట్టి మరీ ఇప్పుడే ఎన్నికలు నిర్వహిస్తున్నారని పలు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా జగన్ మరియు నిమ్మగడ్డ ల మధ్య వార్ ఇప్పట్లో ముగియదని తెలుస్తోంది.

Advertisement