Jagan returns to AP from London : లండన్ నుంచి ఏపీకి తిరిగి వచ్చిన జగన్.. ఇక వ్యూహాలతో ముందుకు..?
NQ Staff - September 12, 2023 / 09:47 AM IST

Jagan returns to AP from London : లండన్ టూర్ ను కంప్లీట్ చేసుకున్న జగన్.. నేడు ఏపీకి తిరిగి చేరుకున్నారు. నేడు ఉదయం ఏపీకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు వైసీపీ నేతలు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. జగన్ తన కూతుర్లను కలవడం కోసం లండన్ కు వెళ్లారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇకపై పూర్తిగా పాలిటిక్స్ కోసం సమయం కేటాయించబోతున్నారు.
కాబట్టి ముందు ముందు బాగాబిజీ అయిపోతారనే ఉద్దేశంతోనే ఆయన కూతుర్లను కలవడం కోసం ఇప్పుడే లండన్ వెళ్లి వచ్చారు. కాగా జగన్ ముందస్తు ప్లాన్ లో భాగంగానే లండన్ వెళ్లారని.. ఆయన కుట్రలో భాగంగానే ఆయన లండన్ వెళ్లగానే పోలీసుల అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు జగన్ తిరిగి రావడంతో టీడీపీ నేతల నోర్లు మూతపడం ఖాయం.
ఏదైనా సరే తప్పించుకుని తిరగడం జగన్ కు అలవాటు లేదు. ఏ ప్రశ్నలకైనా సమాధానం చెప్పేందుకే జగన్ సిద్దంగా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక మీదట ఎన్నికల కోసం ఆయన రెడీ అవుతున్నారు. త్వరలోనే ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ప్లాన్ రెడీ చేసుకోబోతున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, త్వరలోనే బస్సు యాత్ర లాంటివి స్టార్ట్ చేయబోతున్నారంట. ఇందుకోసం అన్ని రకాలుగా ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ 175 సీట్లను గెలిచేందుకు రెడీ అవుతున్నారు. చూడాలి మరి ఆయన ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.