ఎల్లో మీడియా కి జగన్ చావు భాజా … తోలు ఒలిచేశాడు అంతే !

ఆంధ్రాలో మీడియా ప్రభావం ఏ విధంగా ఉంటుందో అందరికి తెలిసిందే, సీఎం జగన్ అంటే కొన్ని మీడియా సంస్థలకు సుతారం ఇష్టం లేదు. ఇదే విషయాన్నీ సీఎం జగన్ కూడా ఆయా మీడియా సంస్థల పేర్లును బహిరంగంగానే ప్రకటించి అనేక సమావేశాల్లో ఆయా మీడియా ప్రతినిధులకు అనుమతి కూడా నిరాకరించాడు.

cm jagan mohan reddy

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, ఈ సమావేశాలను కవర్ చేయటానికి అన్ని మీడియా సంస్థలకు అనుమతి ఇచ్చిన కానీ ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చానళ్లుకు మాత్రం అనుమతి నిరాకరిస్తున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. గతంలో అసెంబ్లీ సెషన్ జరుగుతున్నా సమయంలో ప్రతిపక్ష నేత బయటకు వచ్చిన మాట్లాడిన మాటలను ప్రచారం చేసినందుకు ఆయా చానెల్స్ మీద నిషేధం విధించారు.

ఆ సంఘటనను ఆధారంగా చేసుకొని అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయా చానెల్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఆ చానళ్ల ప్రతినిధుల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వడం లేదు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా నేపథ్యంలో ఆయా ఛానెల్స్ అనుమతి కోరిన కానీ స్పీకర్ అనుమతి ఇవ్వడం లేదు. ఈ వ్యవహారంపై శాసనమండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు.. శాసనండలి చైర్మన్‌కు కు లేఖ రాశారు. అన్ని మీడియా సంస్థలకు పర్మిషన్లు ఇవ్వాలని కోరారు.

ఇప్పటి వరకు ఆయా చానెల్స్ కు ఎలాంటి అనుమతి లభించలేదు. రాష్ట్రంలో ఎల్లో మీడియాగా ముద్ర పడిన వాటికీ అసెంబ్లీ లైవ్ ఇవ్వకుండా సీఎం జగన్ తగిన శాస్తి చేస్తున్నాడని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. గతంలో తెలంగాణలో కూడా కొన్ని మీడియా చానెల్స్ ప్రభుత్వాన్ని చులకన చేస్తూ, ఉన్నవి లేనివి రాస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టటంతో స్వయంగా సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీ లో వాటి బండారం బయట పెట్టి కొన్ని ఏళ్ల పాటు వాటి ప్రచారాలను నిలిపివేయడంతో అప్పుడు ఆ మీడియా సంస్థలు దారికొచ్చాయి, ఇప్పుడు సీఎం జగన్ కూడా తనకు వ్యతిరేక మీడియా విషయంలో అదే విధంగా కఠినంగా ఉంటున్నాడు

Advertisement